తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మృతి పట్ల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతి దక్షిణ భారతదేశానికి తీరని లోటని పవన్ అన్నారు. 'డీఎంకే అధినేత, ద్రవిడ ఉద్యమ తపో పుత్రుడైన కలైంజర్ శ్రీకరుణానిధి గారు తుదిశ్వాస విడవడం విషాదంలో ముంచిది. ద్రవిడ సంస్కృతి పరిరక్షణకు శ్రమించిన కరుణానిధి గారు 
అనారోగ్య సమస్యల నుండి కోలుకుంటారని ఆశించాను.

వారి అస్తమయం కేవలం తమిళనాడుకే కాదు యావత్ దేశానికి ముఖ్యంగా దక్షిణ భారతదేశానికి తీరని లోతు. శ్రీ కరుణానిధి గారు పవిత్ర ఆత్మకు శాంతి కలగాలి. వారి కుటుంబానిని ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. తమిళ రాజకీయాలే కాదు భారత రాజకీయ చిత్రంపై శ్రీకరుణానిధి గారి ముద్ర బలంగా ఉంది. ద్రవిడ రాజకీయాల్లో మేరునగధీరుడు అనదగ్గ శ్రీ కరుణానిధి గారు అణగారిన, వెనుకబడిన సామాజిక వర్గాల అభ్యున్నతికి చేసిన సేవలు చిరస్మరణీయాలు. శ్రీకరుణానిధి గారు వేసిన ఉన్నతమైన బాటలు నేటి తరానికి, భావి తరాలకు చిరస్మరణీయాలు' అంటూ వీడ్కోలు పలికారు.