పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాన్ సిల్వర్ స్క్రీన్‌ రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అజ్ఞాతవాసి సినిమా తరువాత రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పవన్‌ కళ్యాణ్‌, సినిమాలకు దూరమయ్యాడు. ఓ దశలో ఇక పవన్‌ సినిమాలకు గుడ్‌ బై  చెప్పేసినట్టే అన్న ప్రచారం కూడా జరిగింది. అయితే రాజకీయాల్లో దారుణంగా ఫెయిల్‌ కావటంతో పవన్‌ తిరిగి సినిమాల్లో నటించేందుకు అంగీకరించాడు.

ఇప్పటికే బాలీవుడ్‌ సూపర్‌ హిట్ మూవీ పింక్‌ను తెలుగులో వకీల్‌ సాబ్ పేరుతో రీమేక్‌  చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మేజర్‌ పార్ట్ పూర్తి చేసుకుంది. ఇది కాక మరి కొన్ని సినిమాలకు కూడా పవన్‌ ఓకే చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాల దర్శకులకు పవన్ కొన్ని కండిషన్స్ పెట్టాడట. ప్రస్తుతం తన ఇమేజ్‌, పొలిటికల్‌ కెరీర్‌ను దృష్టిలో పెట్టుకొని తన క్యారెక్టర్‌ డిజైన్‌ చేయాలని పవన్ సూచించాడట.

ముఖ్యంగా రొమాంటిక్‌ సీన్స్‌, డ్యాన్స్‌ మూమెంట్స్‌ అస్సలు వద్దని ఖరాకండిగా  చెప్పేశాడట. తాను ప్రజా జీవితంలో ఉండటంతో రాజకీయాలంలో కీలక పాత్ర పోషిస్తుండటంతో అలాంటి సీన్స్ చేయటం కరెక్ట్ కాదని భావిస్తున్నాడు పవన్‌. అందుకే ఇక మీద పవన్ సినిమాలో డ్యాన్స్‌లు, రొమాంటిక్‌ సీన్స్‌ ఉండవు. పవన్‌ నిర్ణయంపై అభిమానులు నిరాశ వ్యక్తమవుతోంది. రొమాంటిక్‌ సీన్స్‌ను ఇరగదీసే పవన్‌, అలాంటి సీన్స్‌ చేయకపోతే సినిమా మీద కమర్షియల్‌గా ప్రభావం పడే అవకాశం ఉందని తెలుస్తోంది.