దిల్ రాజుకి పవన్ ఇచ్చిన మాట ఏమిటో తెలుసా?

First Published 20, Dec 2017, 10:53 AM IST
pawan kalyan commitment to producer dil raju
Highlights

 పెరిగిపోతున్న పవన్ కల్యాణ్ కమిట్ మెంట్స్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో సినిమా చేయాలని చాలా మంది దర్శకనిర్మాతలు కలలు కంటుంటారు. 

ఆ లిస్ట్ లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా ఉన్నాడు. గతంలో పవన్ హీరోగా దిల్ రాజు సినిమా చేసే ఛాన్స్ ఉందనే మాటలు వినిపించాయి. కానీ వర్కవుట్ అవ్వలేదు. ప్రస్తుతం పవన్ రాజకీయాలు, సినిమాలు అంటూ చాలా బిజీ అయిపోయాడు. ఆయన నటించిన 'అజ్ఞాతవాసి' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమా తరువాత ఆయన కమిట్ అయిన ప్రాజెక్ట్స్ ను పూర్తి చేసి 2019 ఎన్నికల ముందు నుండి సినిమాలకు దూరమవుతానని కొన్ని సంధర్భాల్లో చెప్పుకొచ్చాడు. అయితే నిర్మాత దిల్ రాజు మాత్రం పవన్ తనతో సినిమా చేస్తాడని అంటున్నారు. 

అసలు విషయంలోకి వస్తే.. ఇటీవల పవన్ కల్యాణ్ ను కలిసిన దిల్ రాజు సినిమా ప్రస్తావన తీసుకురాగా, రాజకీయాలతో సంబంధం లేకుండా, మంచి కథ సెట్ అయితే మీతో సినిమా చేస్తానని పవన్ చెప్పాడట. ఈ విషయాన్ని మీడియా ముఖంగా వెల్లడించాడు దిల్ రాజు. పైగా 'రాజకీయాలతో సంబంధం లేకుండా' అనే పదాన్ని దిల్ రాజు నొక్కించి మరీ చెప్పడం కాస్త విడ్డూరంగా ఉంది. నిజానికి ఇప్పటికే పవన్ చాలా మందికి సినిమాలు బాకీ ఉన్నాడు. ఏ.ఎం.రత్నంతో ఓ సినిమా చేయాలి.. అలానే మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో కూడా ఓ సినిమా కమిట్ అయ్యాడు. మరి ఈ కమిట్మెంట్స్ అన్నీ ఎప్పుడు పూర్తి చేస్తాడో చూడాలి!

 

 ఇది కూడా చదవండి

హల్లో, ఎంసిఎ ఎలా ఉండబోతున్నాయి

https://goo.gl/VsTkoo

loader