Asianet News TeluguAsianet News Telugu

Pawan Kalyan: ఈ విషయంలో అడ్డంగా బుక్కైన పవన్... చివరికి ఫ్యాన్స్ కూడా ఏకిపారేస్తున్నారుగా..!

ఫ్యాన్స్ కి పవన్ కళ్యాణ్ ఏమి చేసినా ఓకే. ఆయన నిర్ణయాలను, విధాలను వాళ్ళు అంతగా ఫాలో అవుతారు. అయితే పవన్ చేసిన ఓ చర్య మాత్రం చివరికి వాళ్లకు కూడా నచ్చలేదు. ఇలాంటి పనులు ఆపుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 
 

pawan kalyan cheap political trick back fired
Author
Hyderabad, First Published May 22, 2022, 6:13 PM IST

పవన్ కళ్యాణ్ కి ఒకవైపు రాజకీయాలు మరోవైపు సినిమాలు. 2018లో గ్యాప్ తీసుకున్న పవన్ వకీల్ సాబ్ సినిమాతో కమ్ బ్యాక్ ఇచ్చారు. సినిమాలు చేస్తూనే 2024 ఎన్నికలు లక్ష్యంగా ఆయన పని చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఇటీవల రైతు భరోసా యాత్ర చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను కలిశారు. లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేశారు. ఇక ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించే ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. 

రాజకీయాల్లో ప్రత్యర్థుల ఇమేజ్ దెబ్బతీయడం కోసం అనేక కుట్రలు పన్నుతారు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ కూడా మినహాయింపు కాదంటున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ ఏపీలో గల జనసేన కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతున్నారు. మధ్యలో కరెంట్ పోయింది. వెంటనే పవన్ కళ్యాణ్ సెల్ ఫోన్ టార్చ్ ఆన్ చేశారు. ఇంతకంటే సాక్ష్యం ఏమి ఉంటుంది, వైసీపీ నాయకులారా మీరు ఆంధ్రాను అంధకారంలోకి నెట్టేశారంటూ సెటైర్ వేయడంతో పాటు పెద్దగా నవ్వేశారు. 

ఈ వీడియో జనసేన అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేశారు. క్షణాల్లో ఈ వీడియో వైరల్ కాగా పవన్ కళ్యాణ్ విమర్శల పాలయ్యారు. చివరకు సొంత పార్టీ కార్యకర్తలే ఈ వీడియో ఫేక్ అంటూ తేల్చేశారు. వారు అలా ఓపెన్ గా అసహనం వ్యక్తం చేయడానికి కారణం... పవన్ విమర్శలో లాజిక్ మిస్ అయ్యింది. కరెంట్ పోయిందని సెల్ ఫోన్ లైట్స్ వెలిగించారు. కానీ మైక్ మాత్రం ఆన్ లోనే ఉంది. నిజంగా పవర్ లేకపోతే మైక్ ఎలా పని చేసిందనేది మొదటి ప్రశ్న. 

ఇక చాలా కాలం క్రితమే ఆటోమేటిక్ జెనరేటర్స్ అందుబాటులోకి వచ్చాయి. చిన్న చిన్న ఆఫీసుల్లో కూడా జనరేటర్స్  ఉంటున్నాయి. జనసేన ఆఫీస్ కి కూడా కోట్ల విలువ చేసే జనరేటర్ ఉంది. అది పని చేయలేదా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఓకే కనీసం ఇన్వెర్టర్ లేదా? ఇలాంటి చీప్ ట్రిక్స్ తో పరువు పోగొట్టుకోవడం తప్పితే సాధించేది ఏమీ లేదని పవన్ వీరాభిమానులే పవన్ పై ఆవేశం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా టీడీపీ స్క్రిప్ట్ లాజిక్ లేకుండా పవన్ ఫాలో అవుతున్నాడంటూ ప్రత్యర్ధులు టార్గెట్ చేస్తున్నారు. 

తాజా సంఘటన బ్యాక్ ఫైర్ అయినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు హరి హర వీరమల్లు ఇబ్బందుల్లో పడ్డట్లు వార్తలు వస్తున్నాయి. బడ్జెట్ సమస్యలతో ఈ చిత్రం మధ్యలో ఆగిపోయిందట. దాదాపు రెండేళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ  భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారిందంటున్నారు. పవన్ హరి హర వీరమల్లు మూవీని పక్కన పెట్టి భీమ్లా నాయక్ పూర్తి చేయడం కూడా ఈ పరిణామాలకు కారణం. అలాగే చాలా కాలం క్రితమే మొదలు కావాల్సిన హరీష్ శంకర్ మూవీ భవదీయుడు భగత్ సింగ్ సెట్స్ పైకి వెళ్లడం లేదు. 

Follow Us:
Download App:
  • android
  • ios