ఆ అదృష్టాన్ని కలిగించిన భగవంతుడి ధన్యవాదాలు తెలియజేస్తున్నానంటూ.. మెగాస్టార్ చిరంజీవికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమోషనల్ నోట్ విడుదల చేశారు.  

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సినీ రంగంలో ఎన్ని సంచనాలు సృష్టించారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయను స్ఫూర్తిగా తీసుకొని ఎంతో మంది ఇండస్ట్రీకి వచ్చారు.. ఎదిగారు. నాలుగు దశాబ్దాలకు పైగా 150కి పైగా సినిమాల్లో నటించారు. ఆరు పదుల వయస్సు దాటినా ఇప్పటికీ యంగ్ హీరోలకు పోటీగా సినిమాలు చేస్తున్నారు. తన అభిమానులతో పాటు సినీ ప్రియులకు వెండితెరపై దర్శనమిస్తూ అలరిస్తున్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

కొణిదెల శివశంకర వరప్రసాద్ గా చిరంజీవి 1955 ఆగస్టు 22న వెస్ట్ గోదావరి జిల్లాలోని మెగల్తూరులో జన్మించారు. రేపు మెగాస్టార్ పుట్టిన రోజు కావడం విశేషం. రేపటితో 67వ ఏటా అడుగుపెట్టబోతున్నారు. చిరు బర్త్ డే సెలబ్రేషన్స్ ను అభిమానులు గ్రాండ్ గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇక అందరికీ కంటే ముందే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అన్నయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. విషెస్ తెలుపుతూ ఓ ఆసక్తికరమైన ప్రకటన విడుదల చేశారు. 

 అన్నయ్యకు జన్మదిన శుభాకాంక్షలు.. అన్నయ్య చిరంజీవికి ప్రేమపూర్వక శుభాకాంక్షలు. మీ తమ్ముడిగా పుట్టి మిమ్మల్ని అన్నయ్య అని పిలిచే అదృష్టాన్ని కలిగించినందుకు ఆ భగవంతుడికి ముందుగా కృతజ్ఞతలు చెబుతున్నాను. ఒక సన్నని వాగు అలా ప్రవహిస్తూ మహానదిగా మారినట్లుగా మీ ప్రయాణం నాకు గోచరిస్తోంది. మీరు ఎదిగి మేము ఎదగడానికి ఒక మార్గం చూపడమే కాకుండా లక్షలాదిమందికి స్పూర్తిగా నిలిచిన మీ సంకల్పం, పట్టుదల, శ్రమ, నీతినిజాయతీ, సేవాభావం నా వంటి ఎందరికో ఆదర్శం. కోట్లాదిమంది అభిమానాన్ని మూటగట్టుకున్నా... కించిత్ గర్వం మీలో కనిపించకపోవడానికి మిమ్మల్ని మీరు మలుచుకున్న తీరే కారణం. చెదరని వర్చస్సు, వన్నె తగ్గని మీ అభినయ కౌశలంతో సినీ రంగాన అప్రతిహతంగా మీరు సాధిస్తోన్న విజయాలు అజరామరమైనవి. ఆనందకరం, ఆరోగ్యకరమైన సంపూర్ణ ఆయుష్షుతో, మీరు మరిన్ని విజయాలు చూడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. Happy Birthday Annayya’ అంటూ ప్రకటన ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. 

Scroll to load tweet…