పవన్‌ కళ్యాణ్‌ అభిమానులకు బిగ్‌ ట్రీట్‌ ఇవ్వబోతుంది `హరిహర వీరమల్లు` టీమ్‌. ఈ చిత్రం నుంచి ఓ స్వీట్‌ సర్‌ప్రైజ్‌ని ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.  

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌(Pawan Kalyan) తన పుట్టిన రోజు సందర్భంగా అభిమానులను సర్‌ప్రైజ్‌ చేయబోతున్నారు. తాను నటిస్తున్న `హరిహర వీరమల్లు` (HariHara Veramallu)సినిమా నుంచి ఓ ట్రీట్‌ని ఇచ్చేందుకు ప్లాన్‌ చేస్తున్నారట. Pawan BirthDay సందర్భాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్‌ 2న `హరిహర వీరమల్లు` చిత్రం నుంచి గ్లింప్స్ విడుదల చేయబోతున్నారట. యాక్షన్‌ సన్నివేశాలతో కూడిన గ్లింప్స్ ని రిలీజ్‌చేయాలని భావిస్తున్నారట యూనిట్‌. 

ఇప్పటికే ఈ చిత్రం నుంచి ఓ గ్లింప్స్ వచ్చింది. పవన్‌ పాత్రని పరిచయం చేస్తూ విడుదల చేసిన వీడియో గ్లింప్స్ ఆద్యంతం గూస్‌ బంమ్స్ తెప్పించింది. ఇప్పుడు దాన్ని మించి ఉండేలా ప్లాన్‌ చేస్తుందట యూనిట్‌. దర్శకుడు క్రిష్‌ దీనిపై వర్క్ చేస్తున్నట్టు సమాచారం. ఇందులో పవన్‌.. వీరమళ్లు గా కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఆయనకు జోడీగా నిధి అగర్వాల్‌ నటిస్తుంది. క్రిష్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని ఏ ఎం రత్నం నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా 60శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్నట్టు సమాచారం. 

ఇదిలా ఉంటే ఎప్పుడూ చిత్రీకరణ పూర్తి కావాల్సి ఉండగా, పవన్‌ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో డిలే అవుతూ వస్తోంది. ఎట్టకేలకు సెప్టెంబర్‌ నుంచి తిరిగి షూటింగ్‌ ప్రారంభించబోతున్నట్టు సమాచారం. ఈసినిమాకి పవన్‌ బల్క్ డేట్స్ ఇచ్చారని, గ్యాప్‌ లేకుండా షూటింగ్‌ చేసి త్వరగా చిత్రీకరణ పూర్తి చేయాలని భావిస్తున్నారు. సినిమాని సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నారు. మరి రిలీజ్‌పై సస్పెన్స్ నెలకొంది. 

ఇక పవన్‌ కళ్యాణ్‌ బర్త్ డే అంటే అభిమానుల కోలాహలం, హంగామా వేరే లెవల్‌అని చెప్పొచ్చు. ఈ సారి కూడా అలాంటి హంగామానే చేయబోతున్నారు. దీనికితోడు ఓ రోజు ముందుగానే పవన్‌ బ్లాక్ బస్టర్స్ లో ఒకటైన `జల్సా` సినిమాని ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్నారు. మరోసారి పవన్‌ `జల్సా` సినిమాతో ఖుషి చేయబోతున్నారని చెప్పొచ్చు. ఇక చివరగా పవన్‌ `భీమ్లా నాయక్‌`తో ఆడియెన్స్ ముందుకొచ్చారు. ఈ సినిమా హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. తక్కువ టికెట్‌ రేట్లలోనూ మంచి కలెక్షన్లని సాధించడం విశేషం.