పవన్ ‘ఖుషి’ రీరిలీజ్ ట్రైలర్..వైరల్
రికార్డులు తిరగరాయడంలో పవన్ కళ్యాణ్ కి ఎవరూ పోటీ రాలేరు అంటూ ఈ ట్రైలర్ ని ఆయన అభిమానులు సోషల్ మీడియా లో షేర్ చేస్తూ ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆల్ టైమ్ హిట్ లలో ‘ఖుషి’(Khushi) ఒకటి. తమిళ డైరెక్టర్ కమ్ యాక్టర్ ఎస్‌జే సూర్య 2001లో రూపొందించిన ఈ సినిమా సెన్సేషన్ అయ్యింది. పవన్ కెరీర్‌లో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. పవన్‌కు జోడీగా భూమిక నటించగా.. సపోర్టింగ్ రోల్‌లో శివాజీ, అలీ కనిపించారు. మణిశర్మ మ్యూజిక్ సినిమాకు స్పెషల్ ఎస్సెట్‌గా నిలిచింది. పాటలు ఇప్పటికీ జనం పాడుకుంటూ ఉంటారు. హీరోహీరోయిన్ల రొమాంటిక్ సీన్స్, ఇద్దరి మధ్య గిల్లి కజ్జాలు, కెమిస్ట్రీ.. ఇలా అన్నీ కలిపి ‘ఖుషి’ని క్లాసిక్ మూవీగా మార్చేశాయి. ప్రస్తుతం ఇలాంటి ఓల్డ్ క్లాసిక్ మూవీస్ ఫ్యాన్స్ కోసం రీరిలీజ్ అవుతోంది. ఈ నేపధ్యంలో ఇపుడు ‘ఖుషి’ మేకర్స్ రీరిలీజ్ ట్రైలర్ ని రిలీజ్ చేసారు. ఈ ట్రైలర్ ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ లో వైరల్ గా మారింది.
ఈ సినిమాను డిసెంబర్ 31న రీరిలీజ్ చేస్తున్నారు. . ‘ఖుషి’ సినిమాను కూడా టెక్నాలజీ హంగులు చేర్చి, 4కే రిజల్యూషన్, 5.1 డాల్బీ ఆడియోతో రీరిలిజ్ చేయనున్నారు. దీంతో పవన్ అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. ఖుషి చిత్రం ఓ రీమేక్. తమిళ స్టార్ విజయ్, జ్యోతిక జంటగా ఎస్‌జే సూర్య మొదట తమిళ్‌లో ఈ సినిమాను తెరకెక్కించాడు. అక్కడ సక్సెస్ కావడంతో తెలుగులో ఆయనే పవన్‌తో తీశారు.
ఇక హిందీలో కూడా ఫర్దీన్ ఖాన్, కరీనా కపూర్ జంటగా రీమేక్ చేశారు. కానీ తెలుగు, తమిళ్ వెర్షన్స్ మాత్రమే సక్సెస్ అయ్యాయి. తెలుగు వెర్షన్ ‘ఖుషి’ మూవీ నిర్మాత ఏఎం రత్నం కాగా.. మణిరత్నం సంగీతం, పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించారు.తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ భారీ స్థాయిలో ఈ మూవీని రీ రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. దీంతో పవన్ అభిమానులకు ఈ వార్తతో పూనకాలు కన్ఫర్మ్ అని అర్దం అవుతుంది. న్యూ ఇయర్ కానుకగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో… ‘ఖుషి’ నిర్మాత ఏ.ఎమ్.రత్నం నిర్మిస్తున్న హిస్టారికల్ ఫిలిం ‘హరి హర వీరమల్లు’ నుంచి కూడా సర్ ప్రైజ్ గిఫ్ట్..ఈ సినిమాతో పాటు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త ట్రెండింగ్ గా మారింది.