పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలసి నటించిన తాజా చిత్రం భీమ్లా నాయక్. మలయాళంలో ఘన విజయం సాధించిన అయ్యప్పన్ కోషియం చిత్రానికి ఇది రీమేక్ గా తెరకెక్కుతోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలసి నటించిన తాజా చిత్రం భీమ్లా నాయక్. మలయాళంలో ఘన విజయం సాధించిన అయ్యప్పన్ కోషియం చిత్రానికి ఇది రీమేక్ గా తెరకెక్కుతోంది. సాగర్ చంద్ర దర్శకుడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. మరికొద్దిరోజులోనే బాక్సాఫీస్ వద్ద భీమ్లా నాయక్ సందడి షురూ కానుంది. అప్పుడే పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ సునామీ మొదలైపోయింది.
భీమ్లా నాయక్ చిత్రం ఫిబ్రవరి 25న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. దీనితో ప్రస్తుతం ఎక్కడ చూసిన భీమ్లా నాయక్ మానియా కనిపిస్తోంది. పవన్ అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండింగ్ తో హోరెత్తిస్తున్నారు. యూఎస్ లో భీమ్లా నాయక్ అడ్వాన్స్ బుకింగ్స్ ట్రేడ్ కి సైతం ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఉన్నాయి. రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ నమోదవుతుండటం విశేషం. కేవలం ప్రీ సేల్స్ తోనే ఇప్పటి వరకు యూఎస్ లో భీమ్లా నాయక్ చిత్రానికి $300k వసూళ్లు నమోదయ్యాయి. ఇది కేవలం 100 కంటే తక్కువ లొకేషన్స్ లోనే ఈ స్థాయిలో వసూళ్లు నమోదయ్యాయి.
దీనితో పవన్ కళ్యాణ్ తన అజ్ఞాతవాసి చిత్ర రికార్డ్ ని తానే బ్రేక్ చేసుకున్నాడు. అజ్ఞాతవాసి చిత్రం $300k మార్క్ ని 120 లొకేషన్స్ లో అందుకుంది. కానీ భీమ్లా నాయక్ చిత్రం మాత్రం కేవలం 100 లోపు లొకేషన్స్ లోనే ఈ ఘనత సాధించింది.
త్వరలో మరిన్ని లొకేషన్స్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయనున్నారు. దీనితో భీమ్లా నాయక్ చిత్ర వసూళ్లు యుఎస్ లో సునామీ తరహాలో ఉండబోతున్నాయి అంటూ ట్రేడ్ లో అంచనా మొదలైంది.
ఇదిలా ఉండగా నేడు జరగాల్సిన భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా పడింది. ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణం చెందడంతో నిర్మాతలు ప్రీరిలీజ్ ఈవెంట్ వాయిదా వేశారు.
