మిగతా స్టార్స్ తో పాటు పవన్ కళ్యాణ్ కూడా షూటింగ్ కు రెడీ అయిపోయాడు. కరోనా ప్రభావం పూర్తిగా తగ్గే వరకు వెయిట్ చేద్దామనే ఆలోచనని  ప్రక్కన పెట్టి వకీల్ సాబ్ ఇప్పుడు సెట్స్ లో అడుగుపెట్టడానికి ప్రిపేర్ అవుతున్నాడు. కరోనా కాలంలోనే రీఎంట్రీ ప్రాజెక్ట్ ను పూర్తి చేయబోతున్నాడు పవన్ కళ్యాణ్. లాక్ డౌన్ సమయంలో కరోనా తగ్గేవరకు షూటింగ్ కు వెళ్లడం కష్టమని చెప్పాడు పవన్ కళ్యాణ్. అయితే ఇప్పుడు కరోనా ప్రభావం అంత ఈజీగా తగ్గదని అర్దమైంది. దీంతో వెయిట్ చేయడం అర్దంలేని వ్యవహారం అనిపిస్తోంది. దాంతో వకీల్ సాబ్ షూటింగ్ ను రీస్టార్ట్ చేయడమే మంచిదనుకుంటున్నాడట పవన్. ఈ నెల 23 నుంచి వకీల్ సాబ్ షూటింగ్ రీస్టార్ట్ కాబోతోందని సమాచారం. అయితే పవన్ కళ్యాణ్ కొన్ని కండీషన్స్ తో ఈ షూటింగ్ మొదలెట్టబోతున్నట్లు సమాచారం. 

అందుతున్న సమాచారం మేరకు పవన్ కళ్యాణ్ ..కొన్ని స్పెషల్ ఎరేంజ్మెంట్స్ షూటింగ్ కోసం చేయమని అడిగారట. అంతేకాదు...సెట్ లో ఎగస్ట్రా టీమ్ మెంబర్స్ ఉండకూడదని స్ట్రిక్టుగా చెప్పారట. దాంతో దర్శకుడుతో సహా మిగతా టెక్నీషియన్స్ అంతా తమ డిపార్టమెంట్ లో ఉన్న అసెస్టెంట్స్ ని అశోశియోట్స్ ని మళ్లీ చెప్పేదాకా షూటింగ్ కు రావద్దని పురమాయించారట. అలాగే సీనియర్ కో డైరక్టర్స్ ని ఎడిటింగ్, మిగతా విషయాలకే పరిమితం చేస్తున్నారట. సెట్ లో పదిమంది మించి ఉండకూడదని డిసైడ్ చేసారట. దాంతో తమమీద పని భారం పడుతుందని టెక్నీషియన్స్ గోలెత్తుతున్నా, తప్పదు కాబట్టి వేరే దారిలేక ఈ నిర్ణయం అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది.మరోప్రక్క పవన్ సినిమాకు పనిచేద్దామని టీమ్ లో చేరిన వాళ్లు..నిరాశలో మునిగిపోతున్నారు. కానీ ఇక్కడ ఎవరినీ నిందించేది లేదు..కరోనా ని తప్ప.
 
ఇక పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ని డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నాడట. వచ్చే సంక్రాంతి సినిమాను రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడట పవన్. అయితే ఇప్పటి వరకు వకీల్ సాబ్ లో హీరోయిన్ ఎవరనేది ప్రకటించలేదు నిర్మాతలు. మరి ఇప్పటికైనా హీరోయిన్ పేరు ప్రకటిస్తారా అనేది చూడాలి.