ఈ మధ్యకాలంలో పవన్ రాజకీయాల పరంగా బిజీగా ఉంటున్నప్పటికీ సినిమా ఇండస్ట్రీకు మాత్రం దూరం అవ్వలేదు. 'రంగస్థలం','నా పేరు సూర్య','నేల టికెట్టు' వంటి సినిమా ఫంక్షన్స్ కు హాజరయ్యి అభిమానులను ఖుషీ చేశాడు. ఇప్పుడు మరో యంగ్ హీరో సినిమాను ప్రమోట్ చేయాలని పవన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తోన్న 'సాక్ష్యం' సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమాకు సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం ఈ నెల 26న జరగనుంది. హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పవన్ హాజరు కానున్నాడని సమాచారం. నిజానికి పవన్ తన ఫ్యామిలీ ఫంక్షన్స్ కు కూడా దూరంగా ఉంటుంటాడు.

తన అన్నయ్య నాగబాబు రిక్వెస్ట్ చేశాడని.. 'నా పేరు సూర్య' ఈవెంట్ కు, రామ్ తాళ్ళూరితో ఉన్న స్నేహం కారణంగా 'నేల టికెట్టు' సినిమా కార్యక్రమానికి హాజరయ్యారు. మరి 'సాక్ష్యం' సినిమాతో పవన్ కు ఎలాంటి సంబంధం ఉందో తెలియాల్సివుంది!