'బ్రో' ట్రైలర్ వచ్చేసింది, ప్రతి డైలాగు తూటానే.. మాస్ అండ్ ఎమోషనల్ స్టఫ్ తో పవన్, తేజు రచ్చ అదరహో
మామ అల్లుళ్ళు పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన 'బ్రో' చిత్రం జూలై 28న విడుదల కానున్న సంగతి తెలిసిందే. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం వినోదయ సీతంకి రీమేక్.ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బ్రో మూవీ ట్రైలర్ రిలీజయింది.

మామ అల్లుళ్ళు పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన 'బ్రో' చిత్రం జూలై 28న విడుదల కానున్న సంగతి తెలిసిందే. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం వినోదయ సీతంకి రీమేక్. ఇది పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ ఇద్దరి ఇమేజ్ కి భిన్నమైన చిత్రం అని చెప్పొచ్చు. ఈ మూవీలో కేతిక శర్మ, ప్రియా వారియర్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ అలరించాయి.ఇప్పుడు ఫ్యాన్స్ కోరుకునే అసలైన స్టఫ్ వచ్చేసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బ్రో మూవీ ట్రైలర్ రిలీజయింది. 2 నిమిషాల 17 సెకండ్ల నిడివిగల బ్రో ట్రైలర్ అదరహో అనిపించే విధంగా ఉంది. స్టైలిష్ మేకోవర్ లో పవన్, తేజు చేసిన జాతర అంతా ఇంతా కాదు. తెలుగు రాష్ట్రాల్లో వైజాగ్, హైదరాబాద్ లోని వివిధ థియేటర్స్ లో ఫ్యాన్స్ హంగామా మధ్య ట్రైలర్ ని లాంచ్ చేసారు. ఆ థియేటర్లు ఫ్యాన్స్ గోలతో హోరెత్తాయి.
ఇక ట్రైలర్ లో విశేషాలు గమనిస్తే.. ట్రైలర్ లో ఎంటర్టైన్మెంట్ తో పాటు ఎమోషన్ కూడా బలంగా ఉంది. పవన్ కళ్యాణ్ తేజుతో చెప్పే డైలాగులు ఫన్నీగా స్ట్రైకింగ్ గా ఉంటూనే ఆలోచించే విధంగా కూడా ఉన్నాయి. చావు గురించి తేజు చెప్పే డైలాగులు కూడా ఆకట్టుకుంటున్నాయి.
'భస్మాసురుడు అని ఒకడుండేవాడు తెలుసా.. మీ మనుషూలంతా వాడి జాతే. మీ తలపై మీరే పెట్టుకుంటారు. ఇంకెవ్వరికి ఛాన్స్ ఇవ్వరు' అంటూ పవన్ చెప్పే డైలాగ్ తో ట్రైలర్ మొదలవుతుంది. ఆ తర్వాత తేజు ఫ్యామిలీకి సంబందించిన ఫన్నీ సీన్స్ వస్తాయి. తేజుకి మరణం సంభవించి పవన్ దేవుడిగా ఎంట్రీ ఇచ్చాక అసలు రచ్చ మొదలవుతుంది. నీ దగ్గర ఎప్పుడూ లేదు లేదు అంటుంటావే అదే నేను టైం అంటూ పవన్ పవర్ ఫుల్ గా డైలాగ్స్ చెబుతున్నారు. ట్రైలర్ లో ప్రతి డైలార్ తూటాలా పేలింది. తమన్ బిజియం అయితే నెక్స్ట్ లెవల్ లో ఉంటూ ప్రతి సీన్ ని ఎలివేట్ చేసింది. ట్రైలర్ కట్ సింప్లీ సూపర్బ్ అనే చెప్పాలి.
చివర్లో పవన్ మార్క్ ఎంటర్టైనింగ్ స్టైల్ లో ట్రైలర్ ని ఎండ్ చేశారు. చచ్చి బతికిపోయానన్నమాట.. అనవసరంగా బతికి చచ్చా అంటూ తేజు చెబుతున్న డైలాగ్స్ ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. ట్రైలర్ లో పవన్ కళ్యాణ్ వివిధ కాస్ట్యూమ్స్ లో అలరిస్తున్నారు. పంచె కట్టులో కూడా కనిపించారు. జీవితం, చావు బతుకుల అంశాన్ని సముద్రఖని క్లాస్ పీకినట్లు కాకుండా ఎంటర్టైనింగ్ గా డీల్ చేసినట్లు ట్రైలర్ ద్వారా అర్థం అవుతోంది.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇది రీమేక్ చిత్రమే అయినప్పటికీ తమిళ వర్షన్ కి పూర్తి భిన్నంగా ఉంటుందని డైరెక్టర్ సముద్రఖని తెలిపారు. ఆ విధంగా త్రివిక్రమ్ కథని పూర్తిగా మార్చేసినట్లు పేర్కొన్నారు. ఏది ఏదేమైనా ఇది పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి పూర్తి భిన్నమైన చిత్రం.ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సాయిధరమ్ తేజ్, తమన్, సముద్రఖని, నీరంతా టిజి విశ్వప్రసాద్ వివిధ థియేటర్స్ లో పాల్గొన్నారు.