మెగాస్టార్ చిరంజీవి తరువాత వెండితెరపై అంతటి మేనియా సంపాదించిన హీరో పవన్ కళ్యాణ్. చిరు తమ్ముడిగా పరిచయమైన చిరంజీవి తనకంటూ సపరేట్ మేనరిజం, ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. టాలీవుడ్ నుండి అత్యధిక ఫాలోయింగ్ కలిగిన హీరోగా పవన్ రికార్డ్స్ క్రియేట్ చేశారు. పవన్ కళ్యాణ్ నటవారసుడు అకీరాకు మంచి ఫాలోయింగ్. పవన్ ని దేవుడిలా భావించే అభిమానులు అకీరా అంటే కూడా పిచ్చి ప్రేమ కలిగివున్నారు. 


ఇక అకీరా తల్లి రేణూ దేశాయ్ తో పవన్ కళ్యాణ్ విడిపోయి విడాకులు తీసుకున్నప్పటికీ వాళ్ళతో సన్నిహితంగానే ఉంటారు. పిల్లలు అకీరా, ఆద్యలు పవన్ ని తరచూ కలుస్తూ ఉంటారు. అలాగే పవన్ రేణూ నివాసానికి వెళ్లి పిల్లల్ని కలవడం జరుగుతుంది. తాజాగా పవన్ అకీరాని కలిశారు. వీరిద్దరూ కలిసి ఫోటోకి పోజిచ్చారు. ఆరడగుల హైట్ ఉండే పవన్ కంటే కూడా మరో అరడుగు ఎత్తున్నాడు అకీరా. అకీరాను చూస్తుంటే ఆరున్నర అడుగుల బులెట్ గుర్తుకు వస్తుంది. 


ప్రస్తుతం టీనేజ్ లో ఉన్న అకీరా టాలీవుడ్ ఎంట్రీ కోసం పవన్ వీరాభిమానులు ఎదురుచూస్తున్నారు. పవన్ నటవారసుడిగా అతడిని స్టార్ ని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇదే విషయాన్ని అకీరా తల్లి రేణూ దేశాయ్ ని అడుగగా, అది వాడి ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. అయినా కూడా దానికి ఇంకా చాలా సమయం ఉందని రేణూ తెలిపారు.