పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అజ్ఞాతవాసి సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. చిత్రానికి అనిరుథ్ రవిచందర్ సంగీతం స్పెషల్ అట్రాక్షన్‌గా మారింది. ఈ చిత్రానికి సంబంధించిన రెండో సింగిల్ డిసెంబర్ 12న (మంగళవారం) రిలీజ్ చేశారు. సంగీత దర్శకుడు అనిరుథ్ రవిచందర్ పాడిన గాలి వాలుగా ఓ గులాబి.. గాయమైంది గుండెకు తగిలి అంటూ వచ్చే పాటను ఆదిత్య మ్యూజిక్ రిలీజ్ చేసింది. చురకత్తులు దూసి తపన పెడ్తుంటావే అంటూ రాసిన సాహిత్యం ఆకట్టుకుంటోంది.

 

ఇక అజ్ఞాతవాసి చిత్రంలో అభిమానులకు కిక్కెక్కించే ఫైట్స్ సీక్వెన్స్‌ లను రూపొందించినట్టు తెలుస్తున్నది. ఏకంగా ఈ చిత్రంలో ఏడు ఫైట్ సీక్వెన్స్‌లను డిజైన్ చేసినట్టు సమాచారం. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన అతడు చిత్రంలో ఫైట్స్ ఇప్పటికీ ఫ్యాన్స్‌ను ఉత్సాహంలో ముంచెత్తాయి. అతడు సినిమాకు మించిన ఫైట్స్‌ ను ఈ చిత్రంలో కంపోజ్ చేసారట. మూడు యాక్షన్ సీన్లకైతే భారీగా ఖర్చు పెట్టారని ప్రచారం జరుగుతోంది.

 

హారిక, హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌ రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన పవన్‌ ఫస్ట్‌ లుక్‌కు అభిమానుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. అజ్ఞాతవాసిలో కీర్తి సురేష్‌, అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల చేయనున్నారు. 

కాగా అజ్ఞాతవాసి టీజర్ డిసెంబర్ 16న రిలీజ్ చేయనుంది చిత్ర యూనిట్. అంతేకాక ఆడియో ఫంక్షన్ కూడా నిర్వహించే అవకాశాలు కనిపించట్లేదు. దీంతో పవన్ అభిమానుల గుండెలకు గాయాలు.