పవర్ స్టార్ పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ ల అజ్ఞాతవాసికి టాక్ తో సంబంధం లేకుండా ఓపెనింగ్స్ అద్దిరిపోయాయి. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాక.. యుఎస్ కలెక్షన్స్ లోనూ జోరు కొనసాగుతోంది. కేవలం యుఎస్ ప్రీమియర్ షోస్ ద్వారానే అజ్ఞాతవాసి 14,13,000 డాలర్ల వసూళ్లను సాధించింది. దీంతో ప్రీమియర్స్ లోనే దాదాపు ఒకటిన్నర మిలియన్ డాలర్ల మార్కు వసూళ్లకు రీచ్ అయ్యింది.

 

యూఎస్ ప్రీమియర్స్ లో అత్యధిక వసూళ్లను సాధించిన తెలుగు సినిమాల జాబితాలో రెండో స్థానాన్ని సంపాదించింది ఈ సినిమా. తొలి స్థానంలో నిలిచిన బాహుబలి2 వసూళ్లు దాదాపు నాలుగున్నర మిలియన్ డాలర్లు. ఇక మూడోస్థానంలో బాహుబలి పార్ట్ వన్ ఉంటుంది. అది 1.3 మిలియన్ డాలర్ల స్థాయి వసూళ్లను సాధించింది.  ఈరకంగా బాహుబలి పార్ట్ 1 వసూళ్లను దాటేసింది పవన్ అజ్ఞాతవాసి ఇక ఖైదీ నంబర్ 150 రమారమీ 1.29 మిలియన్ డాలర్ల వసూళ్లను సాధించింది.

 

ఇప్పటికైతే యూఎస్ లో ప్రీమియర్స్ లోనే వన్ మిలియన్ డాలర్ల వసూళ్ల మార్కును దాటేసిన సినిమాల్లో అజ్ఞాతవాసి చేరిపోయింది. పవన్ కల్యాణ్ ఇమేజ్, త్రివిక్రమ్ సినిమాలపై ఓవర్సీస్ లో ఉండే ఆసక్తితో ఈ భారీ వసూళ్లు సాధ్యం అయ్యాయని చెప్పాలి. ఇక మున్ముందు మరిన్ని కలెక్షన్స్ సాధించాల్సి వుంది.