తెలుగు సినీ ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్‌గా ఎదుగుతున్న వారిలో ప్రముఖ నిర్మాత, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్. రాధాకృష్ణ(చినబాబు) ఒకరు. 'జులాయి' సినిమాతో మొదలు పెట్టి వరుసగా హిట్లు కొడుతున్న ఆయనకు... ఇటీవల పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన 'అజ్ఞాతవాసి' సినిమాతో భారీ దెబ్బపడింది. ఈ మూవీ వల్ల వచ్చిన నష్టాన్ని తట్టుకుని నిలబడ్డారు చినబాబు. అంతే కాదు ఈ ఫెయిల్యూర్ వల్ల తనపై బ్లాక్ మార్కు పడకూడదని, ఇండస్ట్రీలో తన రిలేషన్స్ దెబ్బతినకూడదు అనే ఉద్దేశ్యంతో నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు సగంమేర పరిహారం కూడా ఇవ్వడానికి సిద్దమయ్యారు.

 

‘అజ్ఞాతవాసి' సినిమా అట్టర్ ప్లాప్ కావడంతో నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు భారీగా నష్టపోయారు. ఆయనకు ఈ సినిమా వల్ల రూ. 14 కోట్ల మేర నష్టం వచ్చిందట. ఈ డబ్బుతో ఆయన ఒక మీడియం రేంజి సినిమా నిర్మించడం గానీ, రెండు సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ చేయవచ్చు. ‘అజ్ఞాతవాసి' సినిమాతో దిల్ రాజు రూ. 14 కోట్లు నష్టపోయిన నేపథ్యంలో అందులో సగం.. అంటే రూ. 7కోట్లు తిరిగి పరిహారం కింద చినబాబు ఇస్తున్నట్లు సమాచారం. దిల్ రాజుతో తన రిలేషన్ దెబ్బతినకూడదనే ఉద్దేశ్యంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారట. ‘అజ్ఞాతవాసి' సినిమా వల్ల నష్టపోయిన మిగతా డిస్ట్రిబ్యూటర్లకు కూడా రాధాకృష్ణ నుండి ఫోన్లు వెళ్లినట్లు సమాచారం. కొందరికి నష్టపరిహారం ఇవ్వడం మరికొందరికి తన ఫ్యూచర్ ప్రాజెక్టుల కమిట్మెంట్స్ ఇవ్వడం లాంటివి చేస్తున్నారట.

 

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఇంత భారీ ఎత్తున ఏ ప్రొడ్యూసర్ పరిహారం కింద ఇవ్వలేదట. పెద్ద నిర్మాతలు, ఎక్స్ పీరియన్స్ ఉన్న నిర్మాతలు సైతం రాధాకృష్ణ చేస్తున్న ఈ పని చూసి ఆశ్చర్యపోతున్నారు. కొందరిలో ఆందోళన అదే సమయంలో రాధాకృష్ణ చేస్తున్న పనిపై కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటివి ఇండస్ట్రీలో అలవాటు చేస్తే భవిష్యత్తులో ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉందని కొందరు నిర్మాతలు వాదిస్తున్నారట.