‘‘సార్ సార్ సార్.. సర్ ఏంటి సార్.. మీకు ఉన్న కోట్లాది మంది అభిమానుల్లో నేనూ ఒకడిని. మీరు నాకు రిప్లై ఇవ్వడం చాలా గొప్ప విషయం నాకు. మీ బర్త్‌డేకి రిటర్న్‌లో నాకు ఎప్పటికీ మరిచిపోలేని గిఫ్ట్ ఇచ్చారు. థాంక్యూ సార్. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది’’ అని కార్తికేయ చేసిన  ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. 

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ బర్త్‌డే సందర్భంగా బుధవారం నాడు  చాలా మంది సెలబ్రెటీలు, ఆయన అభిమానులు శుభాకాంక్షలతో ముంచెత్తారు. చిరంజీవి, వెంకటేశ్‌, మహేష్‌బాబు, అల్లు అర్జున్‌,  సమంత, రకుల్‌ప్రీత్‌, దేవి శ్రీ తదితర సెలబ్రెటీలు సోషల్‌ మీడియా వేదికగా పవర్‌ స్టార్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

అభిమానులతో పాటు తనకు పుట్టినరోజులు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పవన్‌ కల్యాణ్‌ ధన్యవాదాలు తెలిపారు. ట్వీట్స్ కు రిప్లై ఇఛ్చారు. అయితే, పవన్ కళ్యాణ్ ఇచ్చిన రిప్లైకి యంగ్ హీరో కార్తికేయ సర్‌ప్రైజ్ అయ్యి రిప్లై ఇచ్చారు.  అందుకు కారణం ..కార్తికేయను పవన్ కళ్యాణ్ ‘సార్’ అని సంబోధించమే. దీంతో కార్తికేయ ఆశ్చర్యపోయి పై విధంగా రిప్లై ఇచ్చారు.

కేవలం కార్తికేయకు మాత్రమే కాదు.. మరో యంగ్ హీరో సత్యదేవ్‌కు కూడా పవన్ కళ్యాణ్ ఇలానే రిప్లై ఇచ్చారు. ‘‘థాంక్యూ సత్యదేవ్ గారు. మీ లేటెస్ట్ ఫిలిం ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమాలోని మీ నటనకు నేను ఎంతగానో ఎంజాయ్ చేశాను. ఆల్ ది బెస్ట్’’ అని ట్వీట్‌లో స్పందించారు. ఇంకా నాని, రవితేజ, మహేష్ బాబు, రవితేజ, వెంకటేష్, నాని, మోహన్‌లాల్, మంచు మనోజ్, సుధీర్ బాబు, సునీల్, నదియా, కోన వెంకట్, బ్రహ్మాజి.. లకు రిప్లైలు ఇచ్చారు. 

ఇక కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో ప్రజల మేలు కోరి భగవంతుడిని ప్రార్థించడం తప్ప ఏం చేయలేని  పరిస్థితిలో ఉన్నామని తెలిపారు. ఈ సమయంలో శుభాకాంక్షలు స్వీకరించడానికి కూడా మనసు అంగీకరించడంలేదని తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం చాతుర్మాస్య దీక్షను ఆచరిస్తున్నట్లు  జనసేన అధినేత పవన​ కల్యాణ్‌ తెలిపారు. ప్రజల ప్రేమాభిమానాలు తన బాధ్యతను మరింత పెంపొందించాయని తెలిపారు.