నెపోటిజం ఇప్పుడు బాలీవుడ్‌ చిత్రపరిశ్రమని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య నెపోటిజం ఉద్యమానికి పునాది వేసింది. అదిప్పుడు బాలీవుడ్‌ని షేక్‌ చేస్తుంది. తాజాగా పవన్‌ హీరోయిన్‌ ప్రీతి జింగానియా బాలీవుడ్‌లో వారసత్వ రాజకీయాలున్నాయని తెలిపింది. పవన్‌ నటించిన `తమ్ముడు` చిత్రంలో హీరోయిన్‌గా నటించి క్యూట్‌ అందాలతో మెస్మరైజ్‌ చేసిన ఈ బ్యూటీ వారసత్వం గురించి అనేక విషయాలను పంచుకుంది. పలు షాకింగ్‌ విషయాలను వెల్లడించింది. 

నెపోటిజంపై ప్రీతి జింగానియా మాట్లాడుతూ, తనను ఏకంగా బాలీవుడ్ నుంచి తరిమేయాలని ఓ గ్రూపు ప్రయత్నించిందంటూ సంచలన కామెంట్‌ చేసింది. నువ్వు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నావనేది ఇక్కడ ముఖ్యమని, ప్రతి రంగంలో గ్రూపిజం ఉందని తెలిపింది. తాను కొన్ని మల్టీస్టారర్ సినిమాలు చేశానని, ఆ టైమ్ లో గ్రూపిజం ఎదుర్కొన్నట్టు వెల్లడించింది. కొన్ని గ్యాంగ్స్ తనని బాలీవుడ్ నుంచి బయటకు తరిమేయాలని ప్రయత్నించాయని, సెన్సిటివ్ గా ఉంటే ప్రతి ఒక్కరు మనల్ని ఆడుకుంటారని, తాను మాత్రం వాటిని ఎక్కువగా పట్టించుకోలేదని, కెమెరా ముందు కాన్ఫిడెంట్ గా నటించేదాన్ని అని, తన పని తాను చూసుకుని వెళ్ళానని వెల్లడించింది. 

ఇంకా చెబుతూ, `బాలీవుడ్ లో ప్రతి ఒక్కరు షారూక్ ఖాన్ అవ్వలేరు. కాబట్టి ప్రతి ఒక్కరికీ కచ్చితంగా ప్లాన్-బి ఉండాల్సిందే. నెపోకిడ్స్ కు ఎక్కువ తప్పులు చేయడానికి అవకాశం ఉంటుంది. బయట నుంచి వచ్చిన వ్యక్తులకు ఒకే ఒక్క ఛాన్స్ ఉంటుంది. బాలీవుడ్ లో వందల మంది స్ట్రగుల్ అవుతుంటారు. ఒక్కరు మాత్రమే షారూక్ ఖాన్ అవుతారు. ఎంతోమంది తమ ఆశల్ని నెరవేర్చుకునేందుకు ముంబయి వస్తుంటారు. అయితే ఎన్నో కష్టాలు  ఉంటాయి. ఎన్నో చీత్కారాలు ఎదురవుతాయి. ఇందులోకి రాకముందే వీటన్నింటిపై అవగాహన ఉండి తీరాలి. మరీ ముఖ్యంగా ప్రతి ఒక్కరికి బ్యాకప్ ప్లాన్ ఉండాలి. అది లేకపోతే కష్టం` అని షాకింగ్‌ విషయాలను తెలిపింది. 

పవన్‌ కళ్యాణ్‌ హీరోగా రూపొందిన `తమ్ముడు`చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి తొలి చిత్రంలో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ క్యూట్‌ సోయగం.. `నరసింహనాయుడు`, `అధిపతి`, `అప్పారావు డ్రైవింగ్‌ స్కూల్‌`, `ఆనందమానందమాయే`, `యమదొంగ`, `విశాఖ ఎక్స్ ప్రెస్‌` వంటి చిత్రాల్లో నటించింది. మొదట స్టార్‌ హీరోలతో మెరిసి ఆ తర్వాత ఫేడవుట్‌ అయిపోయింది. ప్రస్తుతం ఓటీటీలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. మెయిన్‌ స్ట్రీమ్‌ సినిమాల్లో నటించి మూడేళ్ళవుతుంది.