`సెవెన్‌`, `ఈ నగరానికి ఏమైంది`, `ఫ్యాషన్‌ డిజైనర్‌` చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ కి సుపరిచితమైన అనీషా అంబ్రోస్‌ తాజాగా పండంటి బిడ్డకి జన్మనిచ్చింది. మగ బిడ్డకి ఆమె జన్మినచ్చినట్టు అనీషా తెలిపారు. `ఈ చిట్టిబాబే ఇప్పుడు సర్వస్వం. తన విషయంలో నేను ఇంకా ఏదీ అనుకోలేదు` అని సోషల్‌ మీడియా ద్వారా తన ఆనందాన్నిపంచుకుందీ మాజీ హాట్‌ భామ. 

గతేడాది ఫిబ్రవరిలో అనీషా ఆంబ్రోస్‌  హైదరాబాద్‌కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త గుణ జక్కాను వివాహం చేసుకున్నారు. ఏడాదిన్నర కాలంలోనే వీరింటికి మరో వ్యక్తి చేరడం విశేషం. 

ఇక `అలియాస్‌జానకి` చిత్రంతో తెలుగు ఎంట్రీ ఇచ్చిన ఈ వైజాగ్‌ అమ్మడు అనీషా.. పవన్‌ కళ్యాణ్‌, వెంకీల `గోపాల గోపాల`లో అతిథిగా మెరిసింది. ఆ తర్వాత `రన్‌`, `మనమంతా`, `ఫ్యాషన్‌ డిజైనర్‌ సన్సాఫ్‌ లేడీస్‌ టైలర్‌`, `ఒక్కడు మిగిలాడు`, `ఏ నగరానికి ఏమైంది`, `సెవెన్‌` చిత్రాల్లో మెరిసింది. `సెవెన్‌`లో ఘాటైన అందాలను అలరించిన విషయం తెలిసిందే.