నా పేరు సూర్య బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లు రాక విలవిలలాడిపొతున్నాడు. ఈ సమయంలో కలెక్షన్లు పెరగాలంటే ఏదైన పవర్ రావాల్సిందే. అసలు విషయానికి వెళ్తే ఈ రోజు సాయంత్రం బ్లాస్టింగ్ అనౌన్స్ మెంట్ ఒకటి చేయబోతున్నట్టు సినిమా యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. సక్సెస్ మీట్ మే 10న జరగనుంది. అది ఏమై ఉంటుందా అనే సస్పెన్స్ అందరిలోనూ నెలకొని ఉంది.  నా పేరు సూర్య టీం చెబుతున్న ఆ బ్లాస్ట్ ఏంటో తెలుసా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అవును మే 10న జరగబోయే నా పేరు సూర్య సక్సెస్ మీట్ కి పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా రాబోతున్నాడు. పవన్ కళ్యాణ్ ఆ మధ్య రామ్ చరణ్ రంగస్థలం సక్సెస్ మీట్ కు ముఖ్య అతిధిగా రావడం ఎంత ప్లస్ అయ్యిందో చూసాం. ఇప్పుడు నా పేరు సూర్యకు కూడా అంతకు మించి ఇంపాక్ట్ ఉంటుందని  టీం ధీమాగా ఉంది.

చెప్పను బ్రదర్ ఇష్యూ వల్ల పవన్ ఫాన్స్ బన్నీ మీద అప్పటి నుంచి కొంత కోపంగా ఉన్నారు. ఇప్పుడు పవన్ బన్నీ ఈవెంట్ కు రావడం ద్వారా చాలా పొరలు తొలగిపోతాయని చెప్పొచ్చు.  మరీ ఈ మే 10న ఈ హాంగామా కు ఫ్యాన్స్ భారీగా వస్తున్నారని టాక్.