గమనించారా? :‘అత్తారింటికి‌’ సెంటిమెంట్ ఫాలో అయిన పవన్

 అలాంటి సెంటిమెంట్  ..పవన్ తాజా చిత్రం లాంచ్ లో కనిపించింది. పవన్ కళ్యాణ్ దేవుళ్ల ఫొటోలపై క్లాప్ బోర్డ్ ని 2012లో వచ్చిన అత్తారింటికి దారేది చిత్రం లాంచ్ సమయంలో కొట్టారు. త్రివిక్రమ్ కెమెరా స్విచ్చాన్ చేసారు. ఆ సినిమా అప్పటిదాకా ఉన్న రికార్డ్ లు అన్ని బ్రద్దలు కొట్టి ఇండస్ట్రీ హిట్ గా నమోదు అయ్యింది. 

Pawan Follows Attarintiki Daredi  Sentiment jsp

సినిమావాళ్ళకు సెంటిమెంట్స్ ఎక్కువే. హీరోలకు ఆ పట్టింపు లేకపోయినా కోట్లు పెట్టే నిర్మాతలు మాత్రం సెంటిమెంట్ కు విలువ ఇస్తూంటారు. ఆ సెంటిమెంట్స్ కు హీరోలు,దర్శకులు విలువ ఇస్తూంటారు. అలాంటి సెంటిమెంట్ సీనే..పవన్ తాజా చిత్రం లాంచ్ లో కనిపించింది. పవన్ కళ్యాణ్ దేవుళ్ల ఫొటోలపై క్లాప్ బోర్డ్ ని 2012లో వచ్చిన అత్తారింటికి దారేది చిత్రం లాంచ్ సమయంలో కొట్టారు. త్రివిక్రమ్ కెమెరా స్విచ్చాన్ చేసారు. ఆ సినిమా అప్పటిదాకా ఉన్న రికార్డ్ లు అన్ని బద్దలు కొట్టి ఇండస్ట్రీ హిట్ గా నమోదు అయ్యింది. 

అదే సెంటిమెంట్ ని ఫాలో అవుతూ..ఇప్పుడు పవన్ కళ్యాణ్..దేవుళ్ల ఫొటోలపై ముహూర్తం షాట్ కు క్లాప్ కొట్టారు. అలాగే త్రివిక్రమ్ కెమెరా స్విచ్చాన్ చేసారు. నిర్మాత ఎస్ రాధాకృష్ణ స్క్రిప్టు ని నిర్మాతలకు అందించారు. అలాగే మరో విషయం పవన్ కళ్యాణ్ ..అత్తారింటికి దారేది నాటికు ఎంత గ్లామర్ తో ఉన్నారో ..అదే గ్లామర్ ని ఇప్పుడూ మనం గమనించవచ్చు.
 
ఇక దాదాపు మూడేళ్ల తర్వాత ‘వకీల్‌సాబ్‌’తో రీఎంట్రీ ఇస్తున్నపవన్‌కల్యాణ్‌ .. క్రిష్‌, హరీశ్‌ శంకర్‌తోపాటు సాగర్‌ కె.చంద్ర ప్రాజెక్ట్‌లతో రానున్న రోజుల్లో మరింత బిజీగా మారతున్నారు. ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మరో కీలక పాత్రకు రానాను చిత్ర టీమ్ ఎంపిక చేసింది. ఈ పాత్ర కోసం ఇప్పటికే సుదీప్‌, విజయ్‌సేతుపతి, రానా పేర్లు విస్తృతంగా వినిపించగా, చివరకు ఆ అవకాశం రానాను వరించింది. ఈ మేరకు టీమ్‌లోకి రానాకు ఆహ్వానం పలుకుతూ చిత్ర టీమ్  తాజాగా ఓ స్పెషల్‌ వీడియోను పంచుకుంది. 

‘ఓ అద్భుతమైన ప్రయాణం నేటి నుంచి ప్రారంభం! పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ గారుతో మేము తెరకెక్కించనున్న చిత్రంలోకి మన భళ్లాలదేవుడు రానాకు స్వాగతం పలుకుతున్నాం.’ అని చిత్ర టీమ్ పేర్కొంది. మరోవైపు పవన్‌ సినిమాలో భాగమైనందుకు రానా సంతోషం వ్యక్తం చేశారు. ‘మరో ప్రయాణం ప్రారంభమైంది!! ఇప్పటివరకూ అనేక పరిశ్రమలకు చెందిన ఎంతోమంది స్టార్స్‌తో కలిసి పనిచేశాను. కానీ ఇప్పుడు మన పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌తో కలిసి స్క్రీన్‌ పంచుకోవడం నాకెంతో సంతోషంగా ఉంది. సెట్స్‌లోకి అడుగుపెట్టేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నాను. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌కు ధన్యవాదాలు’ అని రానా ట్వీట్‌ చేశారు. 

సితార ఎంటర్‌ టైన్‌మెంట్స్‌పై, సాగర్‌ కే చంద్ర దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్‌ఎస్‌ సంగీతం అందిస్తున్నారు. తమన్‌ బీజీఎం ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కిల్లర్‌ కాంబో అంటూ అటు పవన్‌, ఇటు రానా అభిమానులు సోషల్‌ మీడియాలో  సందడి చేస్తున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios