‘క్రాక్‌’ ఎఫెక్ట్ : కంగారుపడుతున్న పవన్ ఫ్యాన్స్?

 పవన్ కల్యాణ్‌ కీలక పాత్రలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘వకీల్‌సాబ్’. బాలీవుడ్‌లో మంచి విజయం సాధించిన ‘పింక్‌’ చిత్రానికి తెలుగు రీమేక్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శనివారంతో పూర్తయినట్టు చిత్ర టీమ్ తెలియచేసింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలపై దృష్టి సారించారు. అదే సమయంలో సినిమా ప్రచారంకు కూడా తెర తీస్తున్నారు. 

Pawan Fans tension for Sruthi Hassan look in Vakeel saab jsp

 పవన్ కల్యాణ్‌ కీలక పాత్రలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘వకీల్‌సాబ్’. బాలీవుడ్‌లో మంచి విజయం సాధించిన ‘పింక్‌’ చిత్రానికి తెలుగు రీమేక్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శనివారంతో పూర్తయినట్టు చిత్ర టీమ్ తెలియచేసింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలపై దృష్టి సారించారు. అదే సమయంలో సినిమా ప్రచారంకు కూడా తెర తీస్తున్నారు. అందులో భాగంగా, సంక్రాంతి సందర్భంగా టీజర్‌ని విడుదల చేయనున్నట్టు తెలిసింది. విడుదల తేదీపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. ఇందులో పవన్‌కి జోడీగా శ్రుతిహాసన్‌ నటించింది. అయితే ఇంత ఉత్సాహంగా ఉన్నపవన్ ఫ్యాన్స్ ..క్రాక్ రిలీజ్ తర్వాత కొద్దిగా డల్ అయ్యినట్లు చెప్తున్నారు. అందుకు కారణం శృతి హాసన్ అని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.

అందుతున్న సమాచారం మేరకు..క్రాక్ రివ్యూలలో శృతి హాసన్ గురించి నెగిటివ్ గా వచ్చాయి. శృతి హాసన్ అసలు బాగోలేదని, తేలిపోయిందని,గ్రేస్ లేదని, కృత్రిమంగా ఉందని ఇలా రకరకాలుగా కామెంట్స్ వచ్చాయి. దాంతో శృతిహాసన్ తమ హీరో సినిమాలో ఎలా ఉండబోతోందో అని ఆలోచనలో పడ్డారట. 

ఇక  పవన్, శృతి హాసన్‌ కాంబినేషన్‌లో ఇది మూడో చిత్రం. ఇప్పటికే ‘గబ్బర్ సింగ్’, ‘కాటమరాయుడు’ చిత్రాల్లో ఇద్దరూ కలిసి కనిపించిన సంగతి తెలిసిందే. దిల్ రాజు, బోనీకపూర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి  తమన్‌ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన ‘మగువా.. మగువా’ పాట ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఇక ఇప్పటికే పవన్ కళ్యాణ్ పై తీయాల్సిన సీన్స్ పూర్తయ్యాయి. అయితే లాస్ట్ మినిట్ ఛేంజెస్ వల్లే మొదట పవన్ తో అనుకున్న ఇప్పుడు సీన్స్ వద్దనుకున్నట్లు సమాచారం. 

మొదట పింక్ సినిమాలో హీరోయిన్ ట్రాక్లేదు. కానీ పవన్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఆ సీన్స్ ని పెట్టారు. కొన్ని రొమాంటిక్ సీన్స్, సాంగ్స్ పవన్, శృతిహాసన్ పై ప్లాన్ చేసారు. అయితే ఆ తర్వాత రకరకాల చర్చించిన తర్వాత పొల్లాచ్చిలో పవన్, శృతిహాసన్ లపై చిత్రీకరించాల్సిన డ్యూయిట్ ని డ్రాప్ అయినట్లు సమాచారం. ఆ సాంగ్ కనుక పెడితే కథలో జరిగే కొన్ని ప్రొసిడింగ్స్ ని డిస్ట్రబ్ చేస్తుందని ఫీల్ అయ్యారట. అంతేకాకుండా సెకండాఫ్ లో నడిచే సీన్స్ ల మధ్య ఉండే సీరియెస్ నెస్ కూడా తగ్గుతుందని భావించి వద్దనుకున్నారట. దాంతో పవన్ ని మొదట అనుకున్న సమయం కన్నా ముందే షూట్ ఫినిష్ చేసి పంపేసారని చెప్పుకుంటున్నారు.
   
 నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘పవన్‌ అభిమానులు, సినీ ప్రేక్షకులు కోరుకునేలా ఓ పవర్‌ఫుల్‌ లాయర్‌ పాత్రలో పవన్‌  కల్యాణ్‌గారు కనిపించబోతున్నారు. కరోనా వైరస్‌ పరిస్థితులు కాస్త చక్కబడిన తర్వాత మిగిలిన షూటింగ్‌ను పూర్తి చేసి, సినిమాను వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్‌.ఎస్‌. తమన్‌ , కెమెరా: పి.ఎస్‌. వినోద్, కో ప్రొడ్యూసర్‌: హర్షిత్‌ రెడ్డి.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios