త్రివిక్రమ్ భార్య టాలెంట్ చూశారా..?

pawan family at bharatanatyam recital by trivikram's wife soujanya
Highlights

త్రివిక్రమ్ భార్య ఒక క్లాసికల్ డాన్సర్ అనే విషయం కూడా ఎవరికీ పెద్దగా తెలియదనే చెప్పాలి. రీసెంట్ గా ఆమె రవీంద్రభారతి తన డాన్స్ పెర్ఫార్మన్స్ తో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఈ వేడుకను తిలకించడానికి పవన్ తన భార్య అన్నా లెజ్నెవాతో కలిసి హాజరయ్యారు

స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తన కుటుంబాన్ని సినిమా ఈవెంట్లకు చాలా దూరంగా ఉంచుతాడు. త్రివిక్రమ్ కుటుంబ పరిస్థుతుల గురించి బయట జనాలకు పెద్దగా తెలియదు. ఆయన భార్య సౌజన్య శ్రీనివాస్ మాత్రం అప్పుడప్పుడు ఈవెంట్లలో కనిపిస్తుంటుంది. అది కూడా చాలా అరుదుగా జరుగుతుంటుంది.

అయితే ఆమె ఒక క్లాసికల్ డాన్సర్ అనే విషయంకూడా ఎవరికీ పెద్దగా తెలియదనే చెప్పాలి. రీసెంట్ గా ఆమె రవీంద్రభారతి తన డాన్స్ పెర్ఫార్మన్స్ తో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఈ వేడుకను తిలకించడానికి పవన్ తన భార్య అన్నా లెజ్నెవాతో కలిసి హాజరయ్యారు. అలానే సౌజన్యకు బంధువు అయిన సిరివెన్నెల సీతారామశాస్త్రి కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.

2002లో త్రివిక్రమ్ సౌజన్యను పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్..ఎన్టీఆర్ హీరోగా 'అరవింద సమేత వీర రాఘవ' అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

loader