కరోనా దేశంలో విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది రేణు దేశాయ్‌. కష్టకాలంలో సంతోషంగా ఎలా ఉండాలో తెలిపింది. 

ఆ మధ్య పవన్‌ కళ్యాణ్‌కి చెందిన విషయాలను పంచుకుని వార్తల్లో నిలిచిన పవన్‌ మాజీ భార్య రేణు దేశాయ్‌ తాజాగా బుల్లితెరపై సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె `జీతెలుగు`లో ప్రసారమయ్యే `డ్రామా జూనియర్స్` షోలో జడ్జ్ గా ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా కరోనా దేశంలో విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది రేణు దేశాయ్‌. కష్టకాలంలో సంతోషంగా ఎలా ఉండాలో తెలిపింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇటీవల సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉన్న రేణు దేశాయ్‌ తాజాగా కరోనా గురించి ఓ పోస్ట్ పెట్టింది. `బాధలు, ద్వేషం వంటి వాటిని లెక్కలేనంతగా మోసి మోసి గాడిదల్లా తయారవుతున్నాం. కానీ కేవలం బాధపడేందుకు మాత్రమే మన శరీరం లేదు కదా. బాధల్లో కూడా చిన్నచిన్న ఆనందాలను వెతుక్కొని ముందుకు సాగాలి. మనమంతా ఇప్పుడు చావు, బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాం. సంతోషంగా ఉండటానికి ఏది అవసరమే అది చేయండి. స్టాండప్‌ కామెడీ వీడియోలుగానీ, క్యూట్‌ పప్పీల వీడియోలుగానీ చూడండి. ఈ కష్టకాలం మనకు ఎక్కువ రోజులు ఉండదు. కొన్ని రోజుల తర్వాత అది వెళ్లిపోవాల్సిందే. అదే కాలానికి ఉన్న గొప్పతనం. కాలమే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. జాగ్రత్తలు పాటిస్తూ సురక్షితంగా ఉండండి` అని తెలిపింది. 

View post on Instagram