ఆయ‌న గురించి మాట్లాడేస్థాయి కాదు మాది - త్రివిక్ర‌మ్‌ మ‌న క‌ళ‌ల‌ను తెర‌కు ప‌రిచ‌యం చేసిన వ్య‌క్తి - ప‌వ‌న్‌ 12 సినిమాల‌తో త్వ‌ర‌లో డిస్క్ విడుద‌ల‌
దాదా సాహెబ్ ఫాల్క్ అవార్డ్ విశ్వనాథ్ గారికి రావడం అందరికీ ఆనందం కలిగింది. ఇది తెలుగు వారికి, దక్షిణాది వారికి ఆనందం కలిగించే విషయం. ఆయన గురించి మాట్లాడే స్థాయి, అర్హత తనకు లేకపోయినప్పటికీ ఆనందాన్ని ఎలా చెప్పుకోవాలతో తెలియక ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలియజేసాను. మన సంస్కృతి, కళల గురించి నాకు బాగా తెలిసింది కె.విశ్వనాథ్ సినిమా వల్లే అన్నారు పవన్ కళ్యాణ్ అన్నారు.
త్రివిక్రమ్ మాట్లాడుతూ... కెవిశ్వనాథ్ సినిమాలన్నీ గొప్ప చిత్రాలే. కళ్యాణ్ గారు ఆయనతో మాట్లాడుతున్నపుడు ఓ మాట అన్నారు. ఆయన సినిమాల్లోని 12 బెస్ట్ సినిమాలను ఒక డిస్క్ సెట్ గా తయారు చేసి లిమిటెడ్ ఎడిషన్ లాగా ప్రింట్ చేసి ఆయన పట్ల మాకున్న ఇష్టాన్ని, గౌరవాన్ని ప్రదర్శించాలని అనుకుంటున్నాం.
ఈ సంవత్సరంలోనే ఈ డిస్క్ రిలీజ్ చేస్తాం. కొన్ని అవార్డులు కొంత మందికి ఇచ్చినపుడు అవార్డులకే గౌరవం వస్తుంది. కె.విశ్వనాథ్ గారికి అవార్డు వచ్చిన తర్వాత అవార్డుల మీద నమ్మకం మరింత పెరిగింది. ఆయన గురించి మాట్లాడేందుకు స్థాయిగానీ, అర్హతగానీ, వయసుగానీ ఏవీ మాకు లేవు...కేవలం అభిమానంతో ఇదంతా మాట్లాడుతున్నామని త్రివిక్రమ్ తెలిపారు.
