మెగాస్టార్ చిరంజీవి దూకుడు మాములుగా లేదు. ఆయన కుర్ర హీరోలకు మించి వరుస సినిమాలు ప్రకటిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా ఉన్న కొరటాల శివతో ఆచార్య మూవీ చేస్తున్నారు. సోషల్ కాన్సెప్ట్ తో కూడిన కమర్షియల్ మూవీగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. చిరంజీవి బర్త్ డే కానుకగా విడుదలైన మోషన్ పోస్టర్ విశేష ఆదరణ దక్కించుకుంది. 

ఈ చిత్రం తరువాత చిరంజీవి మలయాళ హిట్ మూవీ లూసిఫర్ తెలుగు రీమేక్ లో నటించనున్నారు. ఇప్పటికే చాలా వరకు స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి అయ్యింది. యంగ్ డైరెక్టర్ సుజీత్ ఈ మూవీని తెరకెక్కించనున్నారు. చిరంజీవి ఇమేజ్, మరియు తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా సుశాంత్ స్క్రిప్ట్ లో కీలక మార్పులు చేసినట్లు సమాచారం. 

కాగా ఈ చిత్రం తరువాత దర్శకుడు మెహర్ రమేష్ తో చిరంజీవి మూవీ చేస్తున్నారనే ప్రచారం సాగుతుంది. కొద్దిరోజులుగా టాలీవుడ్ లో ఈ వార్త వినిపిస్తుంది. మెహర్ చెప్పిన కథకు చిరంజీవి ఇంప్రెస్ అయ్యారని, మూవీ చేద్దాం అని హామీ ఇచ్చారని కథనాలు రావడం జరిగింది. మెహర్ రమేష్ ఫార్మ్ లో లేని కారణంగా ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందని ఎవరూ భావించడం లేదు. కానీ పవన్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. మెహర్ రమేష్ పవన్ కి బర్త్ డే విషెష్ చెప్పగా, శుభాకాంక్షలకు కృతజ్ఞతలు తెలిపిన  పవన్, చిరంజీవితో మీరు చేస్తున్న మూవీకి అల్ ది బెస్ట్ అన్నారు. దీనితో చిరు-మెహర్ రమేష్ మూవీ లాంఛనమే అని అర్థం అయ్యింది.