పవన్ ఇప్పుడు సినిమాల్లోకి వస్తే డబుల్ రెమ్యునరేషన్ అందుతుందని మొన్నటివరకు అనేక రకాల రూమర్స్ వచ్చాయి. ఈ విషయాన్నీ పవన్ కూడా ఒప్పుకున్నాడు.

టాలీవుడ్ లో జయాపజయాలతో సంబంధం లేకుండా తన క్రేజ్ ను ఒక రేంజ్ లో పెంచుకున్న హీరో పవన్ కళ్యాణ్. ఎంత మంది ఎన్ని రికార్డులు సృష్టించినా కూడా తన అభిమానుల సంఖ్యను పవన్ ఏనాడు తగ్గించుకోలేదు. ఇకపోతే ప్రస్తుతం ఆయన పొలిటికల్ లైఫ్ ఎలా ఉంటుందో అనే అంశం అందరిలో ఎంతో ఆసక్తిని రేపుతోంది. 

పవన్ రాజకీయాల్లోకి అనవసరంగా వచ్చారు సినిమాలు చేసుకుంటే బెటర్ అని కామెంట్ చేసినవారు చాలా మంది ఉన్నారు. అయితే పవన్ ఇప్పుడు సినిమాల్లోకి వస్తే డబుల్ రెమ్యునరేషన్ అందుతుందని మొన్నటివరకు అనేక రకాల రూమర్స్ వచ్చాయి. ఈ విషయాన్నీ పవన్ కూడా ఒప్పుకున్నాడు. రీసెంట్ గా పార్టీ మీటింగ్ లో మాట్లాడిన జనసేన అధినేత ఇప్పుడు సినిమా ఒప్పుకుంటే తన రెమ్యునరేషన్ ఏ స్థాయిలో ఉందొ చెప్పాడు. 

అంతే కాకుండా అందుకు గల ఓ అనుమానాన్ని కూడా వ్యక్తం చేశాడు. పవన్ ని ప్రస్తుత రాజకీయాల్లో నుంచి తప్పించడానికి రెమ్యునరేషన్ నాలుగింతల పెంచి సినిమా వల వేస్తున్నారట. ఈ విషయంలో తనకు అనుమానం కలిగిందని నేను ఎలక్షన్స్ నుంచి తప్పుకోవడానికి ఓ విధంగా ఇవి ఎదుటివారి ప్రయత్నాలు అనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశాడు. 

అసలే పవన్ రెమ్యునరేషన్ ఇప్పుడు 40కోట్లకు పైగానే ఉంటుంది. ఇక అంతకు నాలుగింతలు అంటే బాలీవుడ్ హీరోలకు కూడా ఆ రేంజ్ లో అందదేమో.. ఎవరు ఎన్ని వలలు కుట్రలతో ప్లాన్ వేసినా తాను మాత్రం తగ్గానని స్ట్రాంగ్ చెబుతున్న పవన్ ఈ పాలిట్రిక్స్ లో ఎలాంటి మార్పులను తెస్తాడో చూడాలి.

ANN స్పెషల్: ఇవి కాపీ కథలని మీకు తెలుసా? (telugu movies)