సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న 'పటేల్ సర్' యూ/ఎ క్లియరెన్స్ తో సెన్సార్ సర్టిఫికెట్ దక్కించుకున్న పటేల్ సర్ జులై 14న విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి
ఈ మధ్య కాలంలో విలన్ పాత్రలు, క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలకే పరిమితమైన జగపతి బాబు చాలా కాలం తర్వాత మళ్లీ హీరోగా కనిపించబోతున్నారు. ఆయన నటిస్తున్న పటేల్ సర్ మూవీ జులై 14న విడుదలకు సిద్ధమవుతోంది. వారాహి చలనచిత్రం బ్యానర్‌పై సాయి కొర్రపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వాసు పరిమి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కాగా ఇప్పటికే పటేల్ సర్ ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్ కు మంచి స్పందన వచ్చింది.
తాజాగా 'పటేల్ సర్' సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యూ/ఎ సర్టిఫికెట్ పొందింది. జగపతి కెరీర్లో ఇదే ప్రత్యేకమైన సినిమా అవుతుందని అంటున్నారు. వారాహి సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు కూడా అదే రేంజ్ లో వున్నాయి.
బుల్లెట్‌పై స్టైలిష్‌గా వస్తూ ఏజ్ బారైన గ్యాంగ్‌స్టర్‌లా మెప్పించబోతున్నాడు. ఒంటి నిండా టాటూలు, తెల్లజుట్టు, గడ్డంతో స్టైలిష్ అండ్ రఫ్ లుక్‌తో జగ్గూభాయ్ ఇప్పటికే ఆకట్టుకున్నాడు. ఈ చిత్రానికి డిజె వసంత్ సంగీతం అందిస్తున్నారు.
