మలయాళంలో ఒకప్పుడు వరుస అవకాశాలు దక్కించుకొని టాప్ రేంజ్ లో దూసుకుపోయిన నటి పార్వతి మీనన్ కి ఇప్పుడు అవకాశాలు బాగా తగ్గిపోయాయి. దానికి కారణం హీరో దిలీప్ కుమారేనని అతడిపై వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినందుకు ఇండస్ట్రీలో ఆమెకి ఎవరూ అవకాశాలు ఇవ్వడం లేదని ఇటీవల వెల్లడించింది.

తాజాగా ఈ బ్యూటీ 'కరీబ్ కరీబ్ సింగిల్' అనే సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలో ముంబైలో ఓ కార్యక్రమానికి హాజరైంది పార్వతి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..''ఇప్పుడు నేను మాట్లాడే విషయంతో నేను మహిళని కాబట్టి ఇలా మాట్లాడుతున్నానని నాపై ముద్ర వేసే అవకాశం ఉంది. అయినా పర్వాలేదు..

ఎందుకంటే బాధితుల మానసిక స్థితి ఎలా ఉంటుందో చాలా మందికి తెలియదు. ఏమీ తెలియని వయసులో జరిగిన వాటి గురించి ఇప్పుడెలా అర్ధమైందో అంటూ వ్యంగ్యంగా మాట్లాడేవారు కూడా ఉంటారు. అయినా పర్లేదు.. మూడేళ్ల వయసులో నాపై జరిగినవి అకృత్యాలని తెలుసుకోవడానికి నాకు పన్నెండేళ్లు పట్టింది.

ఈ విషయం తెలిసినప్పటి నుండి నా మనశ్శాంతి దూరమైంది. దాడి జరగడం అంటే భౌతికంగా మాత్రమే కాదు.. ఆ చేదు జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉంటాయి. నేను రోజు వాటితో పోరాడుతూనే ఉన్నాను. ప్రతీ విషయాన్ని తల్లితండ్రులతో పంచుకునే నేను ఈ విషయంలో మాత్రం ఏళ్ల తరబడి ఎలా సైలెంట్ గా ఉన్నానో నాకే అర్ధం కావడం లేదు'' అంటూ చెప్పుకొచ్చింది.