ఆ సినిమా మహేష్ బాబుతో తీయకండి... ఆడదు అని ముందే చెప్పా

Paruchuri Gopalakrishna about nijam movie
Highlights

పరుచూరి గోపాలక్రిష్ణ ఎన్నో అద్భుతమైన సినిమాలకు కథలను అందించారు. ఎన్నో సినిమాలకి కథలను .. మాటలను అందించి ఉండటం వలన, ఏ కథ .. ఏ పాత్ర ఎవరికి సెట్ అవుతుందనే విషయంలో ఆయనకి మంచి అవగాహన వుంది. అదే విషయాన్ని తాజాగా ఆయన 'పరుచూరి పాఠాలు'లో చెప్పుకొచ్చారు.
 
త్రివిక్రమ్ ద్వారా తేజ మాకు 'నిజం' అనే కథ చెప్పాడు. కథ చాలా బాగుంది .. మహేశ్ బాబుతో తీయకండి' అని చెప్పాను. 'అదేంటి సార్' అని తేజ ఆశ్చర్యంగా అడిగాడు. 'మహేశ్ బాబుతో 'ఒక్కడు' రాకముందైతే ఇది సూపర్ హిట్ అయ్యేది .. 'ఒక్కడు' తరువాత ఈ కథ మహేశ్ తో చేస్తే ఆడదు' అని చెప్పాను. మమ్మల్ని పక్కన పెట్టేసి వాళ్లు మహేశ్ బాబుతోనే తీసుకున్నారు .. కానీ ఆడలేదుగా. మీకు మరో ఉదాహరణ కూడా చెబుతాను .. 'పాతాళభైరవి' కంటే ముందుగా 'మల్లీశ్వరి ' వచ్చి వుంటే ఆకాశంలో వుండేది. 'కర్తవ్యం' కంటే ముందుగా 'ఆశయం' వచ్చి వుంటే బాగా ఆడేది .. కానీ ఆ తరువాత రావడం మైనస్ అయింది" అంటూ ఆయన చెప్పుకొచ్చారు.          

loader