బాలయ్య బాడీ లాంగ్వేజ్ లో క్లియర్ గా మార్పు.. భగవంత్ కేసరిలో ఆ డైలాగ్ అద్భుతం
నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి చిత్రం అక్టోబర్ 19న రిలీజ్ కి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి, బాలయ్య కాంబోలో తెరకెక్కుతున్న తొలి చిత్రం ఇదే.
నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి చిత్రం అక్టోబర్ 19న రిలీజ్ కి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి, బాలయ్య కాంబోలో తెరకెక్కుతున్న తొలి చిత్రం ఇదే. అందులోనూ వీరసింహారెడ్డి హిట్ తర్వాత బాలయ్య నుంచి వస్తున్న చిత్రం కావడంతో అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. అనిల్ రావిపూడి బాలయ్యని ప్రజెంట్ చేస్తున్న విధానం అందరిలో ఉత్కంఠ రేపుతోంది.
ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా అదరహో అనిపించింది. బాలకృష్ణ తొలిసారి తెలంగాణ యాసలో నటిస్తున్న చిత్రం ఇది. రిలీజ్ కి ముందే ఈ చిత్రంపై సాలిడ్ బజ్ ఏర్పడింది. అయితే సీనియర్ రచయిత పరుచూరి గోపాల కృష్ణ భగవంత్ కేసరి ట్రైలర్ పై తన విశ్లేషణ అందించారు.
2 నిమిషాల పైన నిడివి ఉన్న భగవంత్ కేసరి ట్రైలర్ చూస్తే అనిల్ రావిపూడి అంటే ఏంటో అర్థం అవుతుంది అని బాలయ్య అన్నారు. సినిమా ఎంత అద్భుతంగా ఉండబోతోందో ట్రైలర్ ద్వారా తెలియజేయడం ఒక ట్యాలెంట్ అని పరుచూరి అన్నారు. భగవంత్ కేసరి చిత్రం చూస్తుంటే ఇది ఒక తండ్రి కూతుళ్ళ కథలా అనిపిస్తోంది అని అన్నారు.
అఖండ చిత్రం తర్వాత బాలయ్య బాడీ లాంగ్వేజ్ లో మార్పు క్లియర్ గా కనిపిస్తోంది అని పరుచూరి అన్నారు.సాధారణంగా ఒక మూవీ విజయం సాధిస్తే దాని తర్వాత వచ్చే చిత్రంపై సందేహాలు ఉంటాయి. కానీ భగవంత్ కేసరి ట్రైలర్ తో ఆ అనుమానాలన్నీ తొలగిపోయాయి అని పరుచూరి అన్నారు.
బాలయ్యకి సరిపోయే కథ ఇది. బిడ్డ ముందు తండ్రి నిలబడితే ఆడే వంద దేవుళ్ళ లెక్క అనే డైలాగ్ అద్భుతంగా ఉంది అని పరుచూరి తెలిపారు. దసరాకి విడుదల కాబోతున్న ఈ చిత్రం బాలయ్య అభిమానులకు పండగలా ఉంటుందని భావిస్తున్నట్లు పరుచూరి పేర్కొన్నారు.