లేడి సూపర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి విజయశాంతి. ఆమె కెరీర్ లో ఎన్నో డిఫరెంట్ సినిమాలు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కి కొత్త పాఠాలు నేర్పాయి. ముఖ్యంగా కర్తవ్యం సినిమా విజయశాంతి కెరీర్ లో ఎవర్ గ్రీన్ హిట్. అయితే ఆ సినిమా క్లయిమాక్స్ క్లిక్కవ్వడానికి ప్రధాన కారణం విజయశాంతి అని రచయిత పరుచూరి గోపాల కృష్ణ తెలిపారు. 

రీసెంట్ గా పరుచూరి పలుకులు అనే ప్రోగ్రామ్ లో ఆయన కర్తవ్యం సినిమాను గుర్తు చేసుకున్నారు. అయితే ముందుగా అనుకున్న కథ వేరు. ఆ తరువాత తెరపై కనిపించిన కథ వేరని విజయశాంతి కోరిక మేరకు పలు స్క్రీన్ ప్లే విషయాల్లో మార్పులు చేయాల్సి వచ్చిందని అన్నారు. ముఖ్యంగా కర్తవ్యం క్లయిమాక్స్ సీన్ లో మీన పాత్రకు సంబందించిన సీన్ అందరు బావుందని చెప్పినప్పటికీ ఆమె ఒప్పుకోలేదు. 

విజయశాంతి చెప్పిన విషయాన్నీ గమనిస్తే నిజమే అని అనిపించింది. వెంటనే మరో ఎపిసోడ్ చెప్పడంతో ఆమె షేక్ హ్యాండ్ ఇచ్చి బావుందని అన్నారు. ఆ సినిమా రిలీజ్ అనంతరం పెద్ద హిట్టయ్యింది. అయితే ఆ సినిమా 333 రోజుల ఫంక్షన్ కి ఆమె రాజకీయాల వల్ల రాలేకపోయారని అప్పుడు బాదేసిందని గోపాల కృష్ణ వివరణ ఇచ్చారు.