Asianet News TeluguAsianet News Telugu

`మా` సభ్యులకు అధ్యక్షుడు నరేష్‌ విందు.. ఆరోపణలను తిప్పుకొట్టేందుకు ఆయుధంగా వాడుకుంటున్న వైనం ?

శుక్రవారం రాత్రి దాదాపు వంద మంది సభ్యులకు ప్రస్తుత అధ్యక్షుడు నరేష్‌ పార్టీ ఇవ్వడం విశేషం. ఈ పార్టీ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. 'మా' అధ్యకుడిగా ఎన్నికైనప్పటి నుంచి తనకు పూర్తి సహాయ సహకారాలందించినందుకు, అన్ని విధాలా అండగా ఉన్నందుకు 'మా' సభ్యులకి నరేష్ కృతజ్ఞతలు తెలుపుతూ శుక్రవారం రాత్రి ఆయన నివాసంలో డిన్నర్ పార్టీ ఇచ్చారు. 

party given by maa president naresh to members has now become a hot topic
Author
Hyderabad, First Published Aug 14, 2021, 1:50 PM IST

`మా` ఎన్నికలు మరోసారి మరింత రంజుగా మారాయి. ఈ సారి ప్రస్తుత సభ్యులు పోటీదారులపై తిరుగుబాటుకి తెరలేపారు. ప్రస్తుత కమిటీలోని 109 మంది సభ్యులు `మా`పై అనుచిత కామెంట్లు, ఆరోపణలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కృష్ణంరాజుకి వినతి పత్రాన్ని అందజేయబోతున్నారు. ఇటీవల నటి హేమ `మా`లో అవకతవకలు జరిగాయని, నిధులను నరేష్‌ దుర్వినియోగం చేశారని ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిరంజీవి సైతం దీనిపై సీరియస్‌ అయ్యారు. `మా` క్రమ శిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజుకి లేఖ రాశారు. బహిరంగంగా మా ప్రతిష్టని దెబ్బతీసే వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. 

దీనిపై అధ్యక్షుడు నరేష్‌, కార్యదర్శిగా ఉన్న జీవిత సైతం స్పందించి హేమ వ్యాఖ్యలను ఖండించారు. అదే సమయంలో హేమకు క్రమశిక్షణ సంఘం నుంచి షోకాజ్‌ నోటీసులు పంపించారు. ఈ నేపథ్యంలో శనివారం దాదాపు నూట పది మంది మా సభ్యులు సంతకాలు చేసిన పత్రాన్ని కృష్ణంరాజుకి అందజేసేందుకు నిర్ణయించారు. మొదట వినత్రి పత్రాన్ని ఫిల్మ్ ఛాంబర్‌లోని దాసరి నారాయణరావు విగ్రహానికి అందజేసి, అనంతరం కృష్ణంరాజుకి ఇవ్వబోతున్నారు. అదే సమయంలో ఎన్నికల తేదీని ప్రకటించేందుకు ప్రెస్‌ మీట్‌ కూడా పెట్టబోతున్నట్టు తెలుస్తుంది. 

ఇదిలా ఉంటే శుక్రవారం రాత్రి దాదాపు వంద మంది సభ్యులకు ప్రస్తుత అధ్యక్షుడు నరేష్‌ పార్టీ ఇవ్వడం విశేషం. ఈ పార్టీ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. 'మా' అధ్యకుడిగా ఎన్నికైనప్పటి నుంచి తనకు పూర్తి సహాయ సహకారాలందించినందుకు, అన్ని విధాలా అండగా ఉన్నందుకు 'మా' సభ్యులకి నరేష్ కృతజ్ఞతలు తెలుపుతూ శుక్రవారం రాత్రి ఆయన నివాసంలో డిన్నర్ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి ప్రముఖ కమెడియన్ అలీ, నటులు శివ బాలాజీ, పృథ్వీ, సంపూర్ణేష్, కరాటే కళ్యాణి, సీనియర్ నటుడు రాజ్ కుమార్ సహా..100 మందికి పైగా హాజరయ్యారు. 

రాత్రి నరేష్‌ పార్టీకి హాజరైన వారంతా ఇప్పుడు సంతకాలు పెట్టి హేమపై, మాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారని తెలుస్తుంది. తనపై వచ్చిన కామెంట్లని తిప్పికొట్టేందుకు నరేష్‌ ఈ ప్లాన్ చేశారని మరో ప్రచారం జరుగుతుంది. విందు ఇచ్చి `మా`లోని సభ్యులను తనవైపు తిప్పుకున్నారని, వారందరి తాను అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలను తిప్పికొట్టేందుకు ఆయుధంగా వాడుకుంటున్నారని ప్రచారం జరుగుతుంది. పార్టీ వారిని ఉసిగొలిపారా? అనే కామెంట్లు సోషల్‌ మీడియాలో వినిపిస్తున్నాయి. అదే సమయంలో `మా` బైలాను అతిక్రమించి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని వీరంతా  తీవ్రంగా ఖండిస్తున్నారు. `బైలా`ను ఆసరాగా తీసుకుని నరేష్‌ ఈ ప్లాన్‌ చేశారనే కామెంట్లు వస్తున్నాయి.

మరోవైపు `మా`ని సరిదిద్దుకోవాలని, మన ఇంటిని మనమే సరిదిద్దుకోవాలని మంచు విష్ణు వ్యాఖ్యానించారు. మరోవైపు విదేశాల్లో నిర్వహించిన షోల ద్వారా వచ్చిన డబ్బుని ఏం చేశారని బాలకృష్ణ ప్రశ్నించారు. దీంతోపాటు ప్రకాష్‌ రాజ్‌ సైతం `మా`పై కొన్ని కామెంట్లు చేశారు. ఈ నేపథ్యంలో వారందరిపై కూడా చర్యలు తీసుకుంటారా? మరి నరేష్‌ `మా` సభ్యులకు పార్టీ ఇవ్వడం వెనకాల అసలైన ఉద్దేశం ఏంటీ, తాను ఏం చేయబోతున్నాడనేది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా మరోసారి `మా` ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. కేవలం 900 మంది సభ్యుల గల ఈ సంఘం రెండు తెలుగు రాష్టాల్లో చర్చనీయాంశంగా మారడం గమనార్హం. 

Follow Us:
Download App:
  • android
  • ios