Asianet News TeluguAsianet News Telugu

‘వీరసింహారెడ్డి’లో ఆ సీన్స్ పరిటాల రవి లైఫ్ లోవే ,తేల్చిన డైరక్టర్

పరిటాల జీవితంలోని కొన్ని ఘటనల స్ఫూర్తితో ‘వీరసింహారెడ్డి’ పాత్రతో పాటు ఆ మూవీ ఇంటర్వెల్ బ్లాక్‌ను డిజైన్ చేసుకున్నానని గోపీచంద్ వివరించారు. 

Paritala Ravi Inspired Gopichand Malineni to Design Veera Simha Reddy Character?
Author
First Published Feb 2, 2023, 1:44 PM IST


నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘వీరసింహారెడ్డి’. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ కలిసి నిర్మించిన ఈ చిత్రంలో శృతి హాసన్, హనీ రోజ్.. లు హీరోయిన్లుగా నటించారు. జనవరి 12న సంక్రాంతి కానుకగా ఈ మూవీ రిలీజ్ అయ్యింది.తమన్ సంగీతంలో రూపొందిన పాటలు, టీజర్, ట్రైలర్ వంటివి ప్రేక్షకులను అలరించడంతో ఈ సినిమాకి హైప్ పెరిగింది. ఈ సినిమా విజయవంతమైన నేపధ్యంలో దర్శకుడు ఈ సినిమా గురించిన కొన్ని విషయాలు రివీల్ చేసారు.

నిజ జీవిత  తెరపైకు వస్తూంటాయి. వాటని ఎంజాయ్ చేస్తూంటాం. చెప్పి కొందరు చేస్తూంటారు. చెప్పకుండా స్పూర్తిగా తీసుకుని చేసే పాత్రలు మరికొన్ని. రీసెంట్ గా  సంక్రాంతి రిలీజై  హిట్టయిన ‘వీరసింహారెడ్డి’ సినిమాలో కొన్ని సంఘటనలకు స్పూర్తి పరిటాల రవి అని దర్శకుడు స్వయంగా చెప్పారు.   రాయలసీమ ఫ్యాక్షనిజం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో వీరసింహారెడ్డి పాత్రను పరిటాల రవి స్ఫూర్తితోనే తీర్చిదిద్దినట్లు స్వయంగా దర్శకుడు గోపీచంద్ మలినేని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించి ఆశ్చర్యపరిచారు.

గోపిచంద్ మాట్లాడుతూ.... పరిటాల రవి గురించి తాను విన్నది, చదివింది దృష్టిలో ఉంచుకుని ఆ పాత్రను రూపొందించినట్లు  వివరించాడు. ‘వీరసింహారెడ్డి’ ఇంటర్వెల్ ఎపిసోడ్‌ను పూర్తిగా పరిటాల రవిని దృష్టిలో ఉంచుకునే చేసినట్లు ఆయన చెప్పుకొచ్చారు. ‘పరిటాల రవికి ప్రమాదం ఉందని ఓ పేపర్‌లో చదివాను. ఆయనను కొంతమంది ఎన్ఆర్ఐలు యూఎస్ రమ్మన్నారు. అయితే తాను పుట్టింది ఇక్కడే.. కాబట్టి చనిపోయినా ఇక్కడే అని పరిటాల వద్దన్నారని ఆ పేపర్ ఉంది’ అని గోపీచంద్ మలినేని అన్నారు.

ఇక ఒక సందర్భంలో పోలీసులు తనను తనిఖీ చేస్తుంటే.. పరిటాల రవి తన జీపుకి ఆనుకుని అదేం పట్టనట్లు స్టైల్‌గా సిగరెట్ తాగుతున్న ఫొటోను తాను పేపర్లో చూశానని.. అది దృష్టిలో ఉంచుకునే ‘వీరసింహారెడ్డి’ ఇంటర్వెల్లో చనిపోతూ కూడా స్టైల్‌గా బాలయ్య చుట్ట తాగే సన్నివేశం పెట్టానని గోపీచంద్ చెప్పాడు. ఇక వీరసింహారెడ్డిని శత్రువులు విదేశాల్లో చంపడం వెనుక కూడా పరిటాల రవి గురించి తాను తెలుసుకున్న ఒక విషయం స్ఫూర్తిగా నిలిచిందని అన్నారు. అదేమిటంటే...

పరిటాల మీద ఎటాక్ జరిగి చనిపోవడానికి ముందు ఆయన్ని అమెరికా పర్యటనకు ఆహ్వానించారని.. ఆ టూర్‌కు ఆయన వెళ్లి ఉంటే బతికేవారని అంటారని.. ఒకవేళ పరిటాల విదేశాలకు వెళ్లి అక్కడ ఆయన మీద ఎటాక్ జరిగితే అన్న రకంగా ఆలోచించి తాను ఇంటర్వెల్ ఎపిసోడ్ పెట్టినట్లు గోపీచంద్ వెల్లడించాడు. రాయలసీమలో పరిటాల రవికి ఉన్న ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకునే వీరసింహారెడ్డి పాత్రను కూడా తీర్చిదిద్దామని.. సినిమాలో చూపించిన సన్నివేశాలు అలాగే పరిటాల జీవితంలో జరిగి ఉండకపోవచ్చని.. కానీ ఆ పాత్ర ఆయన వ్యక్తిత్వానికి దగ్గరగా ఉంటుందని గోపీచంద్ అభిప్రాయపడ్డాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios