బాలీవుడ్ లో టాప్ హిరోయిన్ ప‌రిణీతి చోప్రా మొద‌టిసారిగా త‌ప్ప తాగిన ప‌రిణీతి చోప్రా తాగిన మ‌త్తులో క‌నిపించిన వారికి ముద్దులు పెట్టెసిన ముద్దుగుమ్మ‌

ఆ రోజు పెద్ద పార్టీ జరిగింది. రాత్రి 12అయింది. అందరూ వెళ్లిపోయారు. నేను, అలియాభట్, వరుణ్ ధావన్, ఆదిత్య రాయ్ కపూర్ మాత్రం మిగిలాం. నన్ను తాగమని బలవంతం చేశారు. అలవాటు లేదన్నాను. తప్పదన్నారు. ఇక చేసేదేం లేక తాగేశాను. బాగా ఎక్కేసింది. ఏం చేస్తున్నానో అర్థం కాలేదు. ఉదయం 6గంటల వరకు డాన్స్ చేస్తూనే ఉన్నాను. లాబీలోకి వెళ్లిపోయాను.

కనిపించిన ప్రతి ఒక్కరికి ముద్దులు పెట్టేశాను. నో ఫిల్టర్ నేహా కార్యక్రమంలో ఈ విషయాల్ని స్వయంగా వెల్లడించింది పరిణీతి చోప్రా.ఉన్నది ఉన్నట్టు చెప్పేయాలి అదే ఈ షోలో మెయిన్ పాయింట్. నేహా ధూపియా నిర్వహించే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మెంటల్లీ ప్రిపేర్ అయి రావాలి ఎవరైనా. పరిణీతి కూడా అలానే సిద్ధపడి వచ్చింది. తన తొలి తాగుడు ఘటనను బయటపెట్టింది.