ప్రియాంక చోప్రా చెల్లిగా  బాలీవుడ్ కు పరిచయమైంది పరణితి చోప్రా. అందాల ఆరబోతలో  ఇప్పుడు అక్కను మించిపోయింది. పరిచయమైన తొలి రోజుల్లో   సాంప్రదాయ బద్ధమైన హీరోయిన్‌గా కనపించింది. అంతేకాకుండా  తాను ఎక్స్‌పోజింగ్‌కు దూరం అని స్టేట్‌మెంట్స్ కూడా ఇచ్చేసింది.

అయితే ఈలోగా ఎవరు గ్లామరోపదేశం చేసారో ఏమో కానీ తన అందచందాల అరబోత పోగ్రాం పెట్టుకుని రెచ్చిపోవటం మొదలెట్టింది. అది కూడా అలా ఇలా కాదు..ఓ రేంజిలో కావటంతో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఆమె ఫొటోలు చూసి హీటెక్కిపోతున్నారు. సోషల్ మీడియాలో ఆమె క్రే్జ్ ఏ స్దాయికి వెళ్లిందంటే ఇన్స్టాగ్రామ్ లో 16 మిలియన్ల ఫాలోయర్లు ఉన్నారు.

ఇంకా రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నారు. మరి అభిమానులును పెంచుకోగానే సరిపోదు కదా..వాళ్లకు తాయిలాలు ఇస్తూండాలి కదా.  అందుకే తాజాగా ఒక ఫోటోను  పోస్ట్ చేసింది.స్విమ్మింగ్ పూల్ లో బికినీ వేసి భీబత్సం చేసింది.   'స్విచ్ ఆఫ్' కాప్షన్ పెట్టి వదిలిన ఈ ఫొటో ఓవర్ నైట్ లో సెన్సేషన్ అయ్యిపోయింది.

ఈ ఫొటో పెట్టిన ఐదారు గంటలు లోకే నాలుగు లక్షలు పైగా లైకులు వచ్చాయంటే ఎంత బాగా క్లిక్ అయ్యిందో అర్దం చేసుకోండి.  ఇక పరిణితి ఈ మధ్యన ఇంకో స్కీమ్ మొదలెట్టింది.  ఏదైనా పబ్లిక్ ఫంక్షన్లకు వచ్చినప్పుడు మాత్రం చిట్టి పొట్టి బట్టలతో చితక్కొట్టేస్తోంది.  తన సైజులకంటే తక్కువగా ఉండే డ్రెస్సులు వేసుకొని మీడియా ముందు హైలెట్ అవుతోంది.

అంతెందుకు బాలీవుడ్ ప్రముఖ ఫోటోగ్రాఫర్ అయిన డబ్బూ రత్నానీ రూపొందించే క్యాలెండర్‌పై ఏకంగా బోల్డ్ గా  దర్శనం ఇచ్చేసింది. ఇంతలా హాట్ హాట్  ఫోజులతో లైమ్ లైట్‌లోకి వచ్చిన ఈ అమ్మడుకు ఆఫర్స్  ఎలా వెల్లువెత్తుతాయో చూడాలి.