నిన్ను చాలా మిస్ అవుతున్నా.. సుశాంత్ సింగ్‌రాజ్‌పుత్‌పై పరిణీతి చోప్రా ఎమోషనల్ పోస్ట్
పరిణీతి చోప్రా బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్‌ని గుర్తు చేసుకుంది. ఆయనతో కలిసి నటించిన సినిమాని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ వర్డ్స్ షేర్ చేసుకుంది.

బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది. ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాని ఆమె వివాహమాడబోతుంది. త్వరలోనే రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలెస్‌లో వీరి వివాహం గ్రాండ్‌గా జరగబోతుంది. ప్రస్తుతం పెళ్లికి సిద్ధమవుతుంది పరిణీతి చోప్రా. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్‌ని గుర్తు చేసుకుంది. ఆయనతో కలిసి నటించిన సినిమాని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ వర్డ్స్ షేర్ చేసుకుంది.
ఈ ఇద్దరు కలిసి 2013లో `శుద్ధ్ దేశీ రొమాన్స్` చిత్రంలో నటించారు. ఈ సినిమా విడుదలై పదేళ్లు(సెప్టెంబర్ 6) పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా పరిణీతి చోప్రా ఆ రోజులను గుర్తు చేసుకుంది. అవును నిజమే కాలం ఎగిరిపోతుంది. దశాబ్దం గడిచినా ఆ సినిమా జ్ఞాపకాలు ఇంకా కొత్తగానే ఉంటాయని పేర్కొంది. అది నవ్వులతో నిండిన ఓ మధురమైన ప్రయాణం, అలాంటి దిగ్గజ నటులతో ఈ సినిమా చేయడం జీవితంలో గొప్ప అనుభవం. రిషి సార్ మిమ్మల్ని మిస్ అవుతున్నాం. సుశాంత్ సింగ్ నిన్ను చాలా ఎక్కువగా మిస్ అవుతున్నా. మీరు నాకిష్టమైన నటుల్లో ఒకరని పేర్కొంది పరిణీతి చోప్రా.
ఈ సందర్భంగా సినిమా పోస్టర్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ఆమె పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇక `శుద్ధ్ దేశీ రొమాన్స్` చిత్రంలో పరిణీతి చోప్రా, సుశాంత్‌తోపాటు వాణి కపూర్, భువన్ అరోరా, రాజేష్ శర్మలు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం పెద్ద విజయం సాధించింది. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా ఈ చిత్రం రూపొందింది. మనీష్ శర్మ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం 22కోట్లతో రూపొంది, 76కోట్లు వసూలు చేసింది. పెద్ద హిట్ అయ్యింది. సుశాంత్, పరిణీతిలకు పెద్ద బ్రేక్ ఇచ్చింది.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 2020 జూన్ 14న కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. కానీ ఆయన మరణం మిస్టరీగానే ఉండిపోయింది. ఇక పరిణీతి చోప్రా ఏడాదికి ఒకటి రెండు సినిమాలతో అలరిస్తుంది. తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. కానీ స్టార్ ఇమేజ్‌ని మాత్రం తెచ్చుకోలేకపోయింది. పెద్ద హీరోలతో అవకాశాల విషయంలో తడబడుతూనే ఉంది. ఈ క్రమంలో ఇప్పుడు పెళ్లికి సిద్ధమవడం విశేషం. ఇక గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాకి.. పరిణీతి కజిన్ అనే విషయం తెలిసిందే.