పరిణీతి చోప్రా అల్లరి, రాఘవ్ చద్దా ఫ్లైయింగ్ కిస్.. వైరల్ అవుతున్న పెళ్లి వీడియో..

పెళ్లంటే ఇలా ఉండాలి అన్నట్టు  అద్భుతంగా చేసుకున్నారు బాలీవుడ్ బ్యూటీ పరిణితి చోప్రా, రాఘవ్ చద్దా. పరిణితి అల్లరి, రాఘవ్ ముద్దులు.. పెళ్ళంతా ఎంతో సందడిగా జరిగింది. దీనికి సబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. 
 

Parineeti Chopra and Raghav Chadha Wedding Video Viral In Social Media JMS

ఎంత ఖర్చు పెట్టి పెళ్లి చేశామా అనేది కాదు.. ఎంత అందంగా పెళ్ళి జరిగింది... ఎంత సందడిగా పెళ్ళి జరిగింది.. మనసు నిండుగా ఆనందంగా ఎంజాయ్ చేశామా లేదా అనేది  ముఖ్యం.  అయితే ఈ రెండు విషయాలు పర్ఫెక్ట్ గా కలిసిన పెళ్ళిగా నిలిచిపోయింది.బాలీవుడ్ న‌టి ప‌రిణీతి చోప్రా (Parineeti Chopra), ఆప్‌ ఎంపీ రాఘ‌వ్ చ‌ద్దా (Raghav Chadha) వివాహం. ఆదివారం అట్టహాసంగా జ‌రిగిన ఈ వివాహం కోట్లు ఖర్చు పెట్టి అట్టహాసంగా జరిగిన విషయం తెలిసిందే. రాజస్థాన్‌ ఉదయ్‌పూర్‌ (Udaipur)లోని లీలా ప్యాలెస్‌ (Leela Palace)లో పంజాబీ సంప్రదాయంలో వీరి వివాహం జరిగింది.

 ఈ వేడుక‌కు సంబంధించిన కొన్ని ఫోటోల‌ను ప‌రిణీతి త‌న ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్ట్ చేయ‌గా ప్రస్తుతం అవి నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ పెళ్లి కోట్లు ఖర్చు పెట్టి అట్ట హాసంగా మాత్రమే  జరగలేదు. అందరు ఫుల్ గా ఎంజాయ్ చేశారు. అల్లరి చేశారు, సండడి చేశారు.. ముఖ్యంగా పెళ్ళి జంట అయితే .. తెగ ఎంజాయ్ చేశారు. రాఘవ్ చద్దా ప్లైయింగ్ కిస్ లు.. పరిణితి చోప్రా అల్లరి పనులు.. ఇవన్నీ ఆ పెళ్లికి ఎంతో కళను తీసుకువచ్చాయి. అయితే ఈ బ్యూటిఫుల్ మూమెంట్స్ ను పరిణితి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by @parineetichopra

ఈ నేపథ్యంలోనే వివాహం అయిన వారం రోజుల తర్వాత పరిణీతి పెళ్లికి సంబంధించిన ఓ వీడియోను తాజాగా అభిమానులతో పంచుకుంది. రాఘవ్‌ చద్దా కోసం ‘ఓ పియా..’ అనే పాటను ప్రత్యేకంగా రూపొందించినట్లు పరిణీతి వీడియోలో తెలిపింది. వీడియోలో పెళ్ళి జంట ఎంతో సంతోషంగా కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్‌ అవుతోంది. నెటిజన్లు ఈ జంటపై రకరకాల కామెంట్లతో బ్లాగ్ ను నింపేస్తున్నారు. 

రాఘవ్‌-పరిణీతి వివాహం ఈనెల 24వ తేదీన అంగరంగ వైభవంగా జరిగింది. బంధుమిత్రులు, స్నేహితుల సమక్ష్యంలో రాఘవ్‌ తన ప్రేయసి పరిణీతి మెడలో మూడుముళ్లు వేశారు. ఇక ఈపెళ్ళికి ఎంతో మంది స్టార్ సెలబ్రిటీలు రాగా.. అందులో ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌, ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే, మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం సహా పలువురు రాజకీయ, క్రీడా, సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios