సారాంశం

బాలీవుడ్‌ నటి పరిణీతి చోప్రా (Parineeti Chopra), ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ (AAP MP) రాఘవ్‌ చద్దా (Raghav Chadha) వివాహానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరికొన్ని గంటల్లోనే వీరు వివాహబంధంతో ఒక్కటి.
 

బాలీవుడ్‌ నటి పరిణీతి చోప్రా (Parineeti Chopra), ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ (AAP MP) రాఘవ్‌ చద్దా (Raghav Chadha) వివాహానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరికొన్ని గంటల్లోనే వీరు వివాహబంధంతో ఒక్కటి.

బాలీవుడ్  స్టార్ యాక్టర్స్  పరిణీతి చోప్రా, ఢిల్లీ ఎంపీ రాఘవ్ చద్దాల  పెళ్ళి అంతా సిద్దం అవుతోంది. వీరి వివాహాం ఈ ఆదివారం ఘనంగా జరగబోతోంది.  ఈ నెల 24న రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలెస్ లో ఈ స్టార్  సెలబ్రెటీ జంట మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాన్నారు. పెళ్లి ఏర్పాట్లు కూడా చాలా  వేగంగా జరిగాయి.  రాజస్థాన్‌ ఉదయ్‌పూర్‌ లోని లీలా ప్యాలెస్‌  వీరి పెళ్ళికి వేదిక కాబోతోంది. ఈ నేపథ్యంలో పెళ్లికి రెండు రోజులే సమయం ఉండటంతో ఇరు కుటుంబ సభ్యులు పెళ్లి పనులు మొదలు పెట్టేశారు. ఇప్పటికే కొందరు బంధుమిత్రులు ఉదయ్‌పూర్‌ చేరుకున్నారు. 

ఇక తాజాగా పరిణీతి-రాఘవ్‌ కూడా శుక్రవారం ఉదయం ఉదయ్‌పూర్‌లో ల్యాండ్‌ అయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి.  అతిథుల కోసం ఈ జంట స్వయంగా ఏర్పాట్లు పర్యావేక్షించారు. ఇప్పటికే   లగ్జరీ హోటళ్లలో రూమ్స్ బుక్ అయ్యాయి.. చిన్నగా బంధువులు కూడా చేరుతున్నారు.  ఆదివారం వీరి వివాహం జరగనుంది. ఈ పెళ్లి తంతుకు వీరి ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌ ఈనెల 20వ తేదీన ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి అతికొద్ది మంది బంధు మిత్రులు హాజరయ్యారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు కూడా ఇప్పటికే వైరల్‌ అవుతున్నాయి.


రాఘవ్‌-పరిణీతిల పరిణయం సెప్టెంబర్‌ 23, 24 తేదీల్లో రాజస్థాన్‌ ఉదయ్‌పూర్‌ (Udaipur)లోని లీలా ప్యాలెస్‌ (Leela Palace)లో పంజాబీ సంప్రదాయంలో జరగనుంది. పెళ్లి వేడుకకు సమీప బంధువులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరవుతారు. పెళ్లికి వచ్చే అతిథులు, వీవీఐపీల కోసం ఉదయ్‌ పూర్‌లో విలాసవంతమైన హోటళ్లను బుక్‌ చేశారు. హల్దీ, మెహందీ, సంగీత్‌ సహా వివాహాది కార్యక్రమాలు సెప్టెంబర్ 23న ప్రారంభమవుతాయి. పెళ్లి తర్వాత హర్యానాలోని గురుగ్రామ్‌లో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించనున్నారు.