Asianet News TeluguAsianet News Telugu

'తలలు కోసి చేతికిస్తా, చూసుకుందాం రా'.. ఊర మాస్ డైలాగ్స్ తో వైష్ణవ్ తేజ్ నెక్స్ట్ మూవీ, వీడియో

రాగానే బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించాడు వైష్ణవ్ తేజ్. ఉప్పెన చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వైష్ణవ్ తేజ్ నాల్గవ చిత్రం PVT4 నేడు ప్రారంభం అయింది.

Panja Vaisshnav Tej new movie PVT04 launched
Author
Hyderabad, First Published Jun 22, 2022, 1:16 PM IST

రాగానే బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించాడు వైష్ణవ్ తేజ్. ఉప్పెన చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొండపొలం చిత్రంతో తనలోని నటనని బయట పెట్టాడు వైష్ణవ్. ఇప్పుడు వైష్ణవ్ ఊర మాస్ చిత్రానికి రెడీ అవుతున్నాడు. వైష్ణవ్ తేజ్ నాల్గవ చిత్రం PVT4 నేడు ప్రారంభం అయింది. తాజాగా ఈ చిత్ర పూజా కార్యక్రమాలు జరిగాయి. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. 

నేడు ఈ చిత్రం లాంచ్ అయిన సందర్భంగా సినిమా థీమ్ ని వివరించేలా అనౌన్సమెంట్ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో మాస్ డైలాగులు, వైష్ణవ్ తేజ్ లుక్ ఉన్నాయి. తొలిసారి వైష్ణవ్ తేజ్ కోర మీసంతో మాస్ గెటప్ లో కనిపిస్తున్నాడు. వైష్ణవ్ తేజ్.. విలన్ సముద్ర ఖని మధ్య బ్యాగ్రౌండ్ లో పోటాపోటీ మాస్ డైలాగ్స్ వినిపిస్తున్నాయి. 

'రేయ్ రాముడు లంక మీద పడ్డం ఇనుంటావ్.. అదే పది తలకాయలోడు అయోధ్య మీద పడితే ఎట్టుంటాదో చూస్తావా' అని సముద్ర ఖని బెదిరింపు డైలాగ్ అద్భుతంగా ఉంది. దీనికి వైష్ణవ్ తేజ్ కౌంటర్ డైలాగ్ కూడా అంతే ఫిట్టింగ్ గా ఉంది. 'ఈ అయోధ్యలో ఉండేది రాముడు కాదప్పా.. ఆ రావణుడే కొలిచే రుద్ర కాళేశ్వరుడు.. తలలు కోసి చేతికిస్తా నాయాల.. చూసుకుందాం రా' అంటూ వైష్ణవ్ తేజ్ చెప్పే డైలాగ్స్ వింటుంటే సినిమా నెవర్ బిఫోర్ మాస్ అండ్ రాగా ఉండబోతున్నట్లు అర్థం అవుతోంది. 

వైష్ణవ్ తేజ్ ఈ వీడియోలో త్రిశూలం పట్టుకుని పవర్ ఫుల్ గా కనిపిస్తుండగా పక్కనే రంకెలేసి బసవన్న ఉన్నాడు. అనౌన్స్ మెంట్ విడియోతోనే అంచనాలు ఒక రేంజ్ లో పెంచడం అంటే ఇదే. 

ఇక సినిమా కాస్ట్ అండ్ క్రూ విషయానికి వస్తే.. లేటెస్ట్ సెన్సేషన్ పెళ్లి సందD ఫేమ్ శ్రీలీల వైష్ణవ్ తేజ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ.. త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య ఈ చిత్రాన్ని కలసి నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ ఎన్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. 2023 సంక్రాంతికి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.  

 

Follow Us:
Download App:
  • android
  • ios