విశాల్ కథానాయకుడిగా 2005లో వచ్చిన పందే కోడి సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో అందరికి తెలిసిందే. ఎన్.లింగుస్వామి తెరక్కేకించిన ఆ సినిమా తెలుగులో కూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఆ చిత్రం ద్వారానే టాలీవుడ్ లో తనకంటూ ఒక మార్కెట్ ను సెట్ చేసుకున్నాడు విశాల్.
విశాల్ కథానాయకుడిగా 2005లో వచ్చిన పందే కోడి సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో అందరికి తెలిసిందే. ఎన్.లింగుస్వామి తెరక్కేకించిన ఆ సినిమా తెలుగులో కూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఆ చిత్రం ద్వారానే టాలీవుడ్ లో తనకంటూ ఒక మార్కెట్ ను సెట్ చేసుకున్నాడు విశాల్. అయితే అలాంటి కథకు సీక్వెల్ తో మరోసారి ఈ కాంబినేషన్ సౌత్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది
.పందెం కోడి 2 సినిమాను తెలుగులో కూడా భారీగా రిలీజ్ చేయడానికి నిర్మాతలు సన్నాహకాలు చేస్తున్నారు. ముందుగా సెప్టెంబర్ 29న సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసి సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేయడానికి విశాల్ సిద్దమవుతున్నాడు. ఇక సినిమాను అక్టోబర్ 18న దసరా కానుకగా రిలీజ్ చేయనున్నారు. ఠాగూర్ మధు సమర్పణలో విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ - లైక ప్రొడక్షన్ మరియు పెన్ స్టూడియెస్ పతాకాలపై సినిమాను నిర్మించారు.
మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమాలో విశాల్ సరసన కీర్తి సురేష్ నటించింది. వరలక్షి శరత్ కుమార్ - రాజ్ కిరణ్ వంటి వారు ముఖ్య పాత్రలో నటించారు. మరి అప్పట్లో విశాల్ కెరీర్ ను మార్చిన పందెం కోడి తరహాలోనే ఇప్పుడు సీక్వెల్ కూడా అదే తరహాలో విజయాన్ని అందిస్తుందో లేదో చూడాలి.
