తొలి యువ స్వాతంత్య్ర సమరయోధుడు ‘ఖుదీరాం బోస్’ జీవితం ఆధారం రూపొందించిన చిత్రం Khudiram Bose. ఈ చిత్రం తాజాగా ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 2022కు ఎంపికై జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకుంది.
1889లో జన్మించిన 'ఖుదీరామ్ బోస్' భారత స్వాతంత్ర్య ఉద్యమంలో తొలి, అతి చిన్న వయస్కుడైన స్వాతంత్ర్య సమరయోధుడిగా ప్రసిద్ధి చెందారు. ప్రసిద్ధ ముజఫర్‌పూర్ కుట్ర కేసులో ఖుదీరాం బోస్ బ్రిటిష్ రాజ్ చేత దోషిగా నిర్ధారించబడి, 1908లో ఉరికంభం ఎక్కారు. అయితే ఆ యోధుడి జీవితం ఆధారంగా ఆయన పేరుతోనే తెలుగులో రూపొందించిన చిత్రం ‘ఖుదీరాం బోస్’. ఆగస్టులోనే ఈచిత్ర టైటిల్ పోస్టర్లను మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు విడుదల చేశారు.
చిత్రంలో రాకేష్ జాగర్లమూడి ప్రధాన పాత్రలో నటించారు. విజయ్ జాగర్లమూడి, డీవీఎస్ రాజు దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి తాజాగా అరుదైన గౌరవం దక్కింది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) 53వ ఎడిషన్‌లో ప్రదర్శించడానికి ఈ తెలుగు చిత్రం 'ఖుదీరామ్ బోస్' ఎంపికైంది. నూతన నిర్మాత రజిత విజయ్ జాగర్లమూడి, దర్శకులు విజయ్ జాగర్లమూడి, డివిఎస్ రాజు ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ చిత్రాన్ని IFFI ప్రధాన భాగమైన ఇండియన్ పనోరమా కింద ఎంపిక చేయడం పట్ల సంతోషిస్తున్నారు. నవంబర్ 20 నుంచి 28 వరకు గోవాలో కొనసాగుతున్న ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో ‘ఖుదీరాం బోస్’ను ప్రదర్శించనున్నట్టు తెలిపారు.
జాగర్లమూడి పార్వతి సమర్పణలో గోల్డెన్ రెయిన్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ, హిందీ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. రాకేష్ జాగర్లమూడి తొలిసారిగా నటుడిగా, ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్ట్‌లో అత్యుత్తమ నటన మరియు సాంకేతిక ప్రతిభావంతుల కలయిక కనిపిస్తుంది. సంగీత దర్శకుడు మణి శర్మ, అవార్డు గెలుచుకున్న ప్రొడక్షన్ డిజైనర్ పద్మశ్రీ తోట తరణి, స్టంట్ డైరెక్టర్ కనల్ కన్నన్ మరియు సినిమాటోగ్రాఫర్ రసూల్ ఎల్లోర్ ఈ ప్రాజెక్ట్‌తో అనుబంధించబడిన అత్యుత్తమ ప్రతిభావంతులలో కొందరు. ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ మరియు డైలాగ్ రైటర్ బాలాదిత్య కూడా ఈ చిత్రానికి పనిచేశారు.
