Asianet News TeluguAsianet News Telugu

చిన్నప్పుడు గ్యాంగ్‌ రేప్‌.. బిగ్‌ బాస్‌ చరిత్రలో అత్యధిక పారితోషికం..

హిందీలో ఓ కంటెస్టెంట్‌కి ఏకంగా రెండు కోట్లు పారితోషికం అందివ్వడం విశేషం. కేవలం మూడు రోజులకే రెండు కోట్లు అందుకున్నారు. ఆ విషయం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది.

pamela anderson two times rape victim than she highest paid bigg boss contestant arj
Author
First Published Oct 11, 2023, 2:16 PM IST

విదేశాల నుంచి వచ్చి టీవీ రియాలిటీ షో `బిగ్‌ బాస్‌` ఇండియాలోనూ విశేష ఆదరణ పొందుతుంది. హిందీతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలోనూ ఈ షోని నిర్వహిస్తున్నారు. చిత్ర పరిశ్రమకి చెందిన బిగ్‌ స్టార్స్ ఈ షోకి హోస్ట్ గా చేస్తుండటంతో దీనికి మంచి ఆదరణ దక్కుతుంది. ఫ్యామిలీ ఆడియెన్స్ దీన్ని బాగా చూస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో ఏదో సీజన్‌ రన్‌ అవుతుంది. ఉల్టాపుల్టా అనేలా సాగుతుంది. ట్విస్ట్ లు, టర్న్ లతో ఇంట్రెస్టింగ్‌గా రన్‌ అవుతుంది. 

ఇక మన ఇండియాలో మొదటగా హిందీలో ఈ షో ప్రారంభమైంది. ప్రస్తుతం 17వ సీజన్‌ నడుస్తుంది. సల్మాన్‌ హోస్ట్ గా ఈ రియాలిటీ షో రన్ అవుతున్న విషయం తెలిసిందే. మూడు నాలుగు సీజన్లు తప్ప మిగిలిన అన్ని షోలకు సల్మాన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఆయనకు కోట్ల రూపాయలు పారితోషికంగా అందిస్తున్నారు. కానీ కంటెస్టెంట్ల పరంగా మాత్రం కోటికి మించి పారితోషికం దక్కడం కష్టం. విన్నింగ్‌ ప్రైజ్‌ మనీ యాభై లక్షలు, వారి పారితోషికం యాభై లోపు ఉంటుంది. ఇలా కేవలం విన్నర్ కి మాత్రమే కోటిపైగా దక్కుతుంది. 

కానీ హిందీలో ఓ కంటెస్టెంట్‌కి ఏకంగా రెండు కోట్లు పారితోషికం అందివ్వడం విశేషం. కేవలం మూడు రోజులకే రెండు కోట్లు అందుకున్నారు. ఆ విషయం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. ఆ వివరాలు చూస్తే.. హిందీలో నాల్గో సీజన్‌ బిగ్‌ బాస్‌ షోలో కంటెస్టెంట్లతోపాటు హాలీవుడ్‌ నటి పమేలా ఆండర్సన్‌ కూడా పాల్గొంది. షోకి హైప్‌ తెచ్చేందుకు నిర్వాహకులు ఆమెని కంటెస్టెంట్‌గా తీసుకొచ్చారు. అయితే కేవలం మూడు రోజులు మాత్రమే ఆమె గెస్ట్ గా హౌజ్‌లో ఉంది. 

ఆ మూడు రోజులకు పమేలా అండర్సన్‌కి ఇచ్చిన పారితోషికం వింటే మైండ్‌ బ్లాంక్‌ అవుతుంది. ఆమెకి ఏకంగా రూ రెండు కోట్లు చెల్లించారట. ఆ ఒప్పందంతోనే ఆమె హౌజ్‌లోకి అడుగుపెట్టిందట. ఆ విషయం ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతుంది. ఆ తర్వాత 15వసీజన్‌లో బిగ్‌ బాస్‌ టైటిల్‌ విన్నర్‌ తేజస్వి ప్రకాష్‌కి కోటీ డెబ్బై లక్షలు దక్కింది. 

అమెరికా-కెనడియన్‌ నటి అయిన పమేలా చిన్నప్పటి లైఫ్‌ దారుణంగా సాగింది. ఆమె దారుణమైన హింసకి గురైంది. తాను రెండు సార్లు లైంగిక దాడికి గురైందట. ఆ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది పమేలా. ఆరేళ్ల సమయంలో ఓ మహిళ తనని వేధించిందట. దాదాపు నాలుగేళ్ల పాటు ఆ వేధింపులు ఎదుర్కొందట. ఆ తర్వాత 12ఏళ్ల వయసులో 25ఏళ్ల వ్యక్తి తనపై అత్యాచారం చేశాడట. ఆ తర్వాత తన ప్రియుడు అతని ఆరుగురు స్నేహితులతో కలిసి గ్యాంప్‌ రేప్‌కి ఒడిగట్టాడని వెల్లడించింది.  అలాంటి స్థితి నుంచి వచ్చిన పమేలా ఇప్పుడు అంతర్జాతీయంగా స్టార్‌ హీరోయిన్‌గా, అత్యధిక పారితోషికం అందుకునే నటిగా రాణిస్తుంది. 

ఆమె ప్లేబాయ్‌ మ్యాగజీన్‌లో మోడల్‌గా గుర్తింపు తెచ్చుకుంది. బికినీ పోజులతో షేక్‌ చేసింది. దీంతోపాటు టీవీ సిరీస్‌ `బేవాచ్‌`లో నటించింది. దీనితో పాపులర్‌ అయ్యింది. ఎక్కువగా టెలివిజన్‌ సిరీస్‌లు చేస్తూ రాణిస్తుంది. ఇక పర్సనల్‌ లైఫ్‌లో ఆమె ఐదుగురు భర్తలను మార్చేసింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios