Asianet News TeluguAsianet News Telugu

సీఎం రేవంత్ రెడ్డి స్టైల్ లో రెచ్చిపోయిన పల్లవి ప్రశాంత్.. కోర్టులో రిలీఫ్ దొరకడంతో ఏం చేశాడంటే, వీడియో

గత సీజన్ల కంటే బిగ్ బాస్ సీజన్ 7 బాగా హైలైట్ అయింది. శివాజీ, పల్లవి ప్రశాంత్, శోభా శెట్టి, ప్రియాంక జైన్, అమర్ దీప్ హౌస్ లో పోరాడిన తీరు అద్భుతం అనే చెప్పాలి. హౌస్ లో వీళ్లంతా రెండు గ్రూపులుగా విడిపోయి ఆడారు.  చివరికి పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు.

Pallavi Prashanth gets big relief from nampally court  dtr
Author
First Published Feb 22, 2024, 5:19 PM IST | Last Updated Feb 22, 2024, 5:20 PM IST

గత సీజన్ల కంటే బిగ్ బాస్ సీజన్ 7 బాగా హైలైట్ అయింది. శివాజీ, పల్లవి ప్రశాంత్, శోభా శెట్టి, ప్రియాంక జైన్, అమర్ దీప్ హౌస్ లో పోరాడిన తీరు అద్భుతం అనే చెప్పాలి. హౌస్ లో వీళ్లంతా రెండు గ్రూపులుగా విడిపోయి ఆడారు.  చివరికి పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. సామాన్యుడు, రైతు బిడ్డ అనే సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది. అదే విధంగా శివాజీ అతడికి సహకారం అందించారు. అయితే హౌస్ నుంచి బయటకి వచ్చిన తర్వాత పల్లవి ప్రశాంత్ ఎలాంటి సమస్యల్లో ఇరుక్కున్నాడో తెలిసిందే.

బిగ్ బాస్ అనంతరం పల్లవి ప్రశాంత్ నిర్వహించిన ర్యాలీ కారణంగా అల్లర్లు జరిగాయి. ప్రభుత్వ వాహనాలు ధ్వంసం అయ్యాయి. పోలీసులు వారిస్తున్నా వినకుండా పల్లవి ప్రశాంత్ తన అభిమానులతో ర్యాలీ కొనసాగించాడు. ఫలితంగా అల్లర్లు మరింత ఎక్కువై విధ్వంసంగా మారింది. 

దీనితో పోలీసులు పల్లవి ప్రశాంత్, అతడి సోదరుడిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం పల్లవి ప్రశాంత్ బెయిలుపై బయటకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా పల్లవి ప్రశాంత్ కేసులో కోర్టు కీలక ఆదేశాలు ఇస్తూ అతడికి బిగ్ రిలీఫ్ ఇచ్చింది. 

బెయిల్ కండిషన్ ప్రకారం పల్లవి ప్రశాంత్ ప్రతి నెల జూబ్లీ హిల్స్ పోలిసుల ఎదుట హాజరై సైన్ చేయాల్సి ఉంటుంది. కానీ తాజాగా కోర్టు పల్లవి ప్రశాంత్ కి రిలీఫ్ ఇచ్చింది. ఇకపై పల్లవి ప్రశాంత్ పోలీస్ స్టేషన్ లో హాజరు కావాల్సిన అవసరం లేదని పేర్కొంది. కోర్టు విధించిన రెండు నెలల గడువు పూర్తి కావడంతో ప్రశాంత్ తరుపున న్యాయవాదులు రిలాక్సేషన్ పిటిషన్ వేసారు. పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం పల్లవి ప్రశాంత్ కి ఊరటనిచ్చింది. 

కోర్టు తీర్పుతో పల్లవి ప్రశాంత్ లో ఫుల్ జోష్ వచ్చేసింది. ఈ సంతోషాన్ని పల్లవి ప్రశాంత్ సీఎం రేవంత్ రెడ్డి స్టైల్ లో సెలెబ్రేట్ చేసుకుంటున్నాడు. రేవంత్ రెడ్డి పొలిటికల్ సాంగ్ తో ఒక వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో రేవంత్ రెడ్డి పాటతో పాటు కోర్టు ఇచ్చిన తీర్పుని వివరిస్తుంది న్యాయవాదుల కామెంట్స్ కూడా జత చేశాడు. ఈ పోస్ట్ ని 'ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది' అంటూ పల్లవి ప్రశాంత్ పవర్ ఫుల్ క్యాప్షన్ ఇచ్చాడు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios