MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • TV
  • Pallavi Prashanth: పరారీలో బిగ్ బాస్ టైటిల్ విన్నర్... పోలీసుల గాలింపు!

Pallavi Prashanth: పరారీలో బిగ్ బాస్ టైటిల్ విన్నర్... పోలీసుల గాలింపు!

బిగ్ బాస్ తెలుగు టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ పోలీసుల టార్గెట్ అయ్యాడు. అరెస్ట్ కి రంగం సిద్ధం కాగా పరారీలో ఉన్నాడు. పల్లవి ప్రశాంత్ వివాదం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా ఉంది.   

2 Min read
Author : Sambi Reddy
| Updated : Dec 20 2023, 10:26 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Bigg Boss Telugu 7

Bigg Boss Telugu 7

బిగ్ బాస్ టైటిల్ గెలిచిన పల్లవి ప్రశాంత్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయ్యాడు. అతనితో పాటు ఫ్యాన్స్ అత్యుత్సాహం సమస్యల్లోకి నెట్టింది. పల్లవి ప్రశాంత్ అరెస్ట్ కావడం ఖాయంగా కనిపిస్తుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

పల్లవి ప్రశాంత్-అమర్ దీప్ ఫ్యాన్స్ మధ్య షో ప్రారంభం నుండి వివాదం నడుస్తోంది. సోషల్ మీడియాలో వార్ జరుగుతుంది. కుటుంబ సభ్యులు కూడా కొన్ని వీడియోలు పోస్ట్ చేశారు. అమర్ దీప్ తన కొడుకును తక్కువ చేసి చూస్తున్నాడని పల్లవి ప్రశాంత్ తండ్రి ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇక పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ తిడుతున్నారని అమర్ దీప్ తల్లి ఫైర్ అయ్యింది. 
 

37

డిసెంబర్ 17న ఫినాలే ముగిసింది. పల్లవి ప్రశాంత్ ని టైటిల్ విన్నర్ గా ప్రకటించారు. ప్రకటనకు ముందే అమర్ దీప్, పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అన్నపూర్ణ స్టూడియో వద్దకు భారీగా చేరుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య గొడవలు చోటు చేసుకున్నాయి. పిడిగుద్దులు కురిపించుకోవడం కూడా అయ్యింది. పరిస్థితి అదుపు తప్పేలా ఉన్న నేపథ్యంలో విజయోత్సవ ర్యాలీ వద్దని పోలీసులు పల్లవి ప్రశాంత్ ని వెనుక డోర్ నుండి పంపేశారు. 
 

47

పోలీసుల సూచనలు ఖాతరు చేయకుండా పల్లవి ప్రశాంత్ ఓపెన్ టాప్ కారులో అన్నపూర్ణ స్టూడియోకి వచ్చాడు. పల్లవి ప్రశాంత్ రావడంతో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ చోటు చేసుకుంది. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అమర్ దీప్, గీతూ రాయల్, అశ్విని శ్రీ కార్ల అద్దాలు పగలకొట్టారు. అంతటితో ఆగకుండా ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాల మీదకు రాళ్లు రువ్వి ప్రాపర్టీ నాశనం చేశారు. 
 

57


ఈ ఘటనపై పోలీసులు సీరియస్ అయ్యారు. పల్లవి ప్రశాంత్ తో పాటు అనుచరుల మీద పలు సెక్షన్స్ క్రింద కేసులు నమోదు చేశారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తిస్తున్నారు. పల్లవి ప్రశాంత్ బ్రదర్ పరశురాములు కోసం వారి గ్రామానికి పోలీసులు వెళ్లారు. అరెస్ట్ వార్తల నేపథ్యంలో పల్లవి ప్రశాంత్ పరార్ అయినట్లు తెలుస్తుంది. 

 

67


కారు డ్రైవర్ సాయి కిరణ్ ని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. పల్లవి ప్రశాంత్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్నట్లు తెలుస్తుంది. పల్లవి ప్రశాంత్ ని అదుపులోకి తీసుకునేందుకు మూడు టీమ్స్ రంగంలోకి దిగాయి. అతడు కొమరవెల్లి సమీపంలో ఉన్నాడని తెలిసి అక్కడకు పోలీసులు వెళ్లారు. ప్రస్తుతానికి పల్లవి ప్రశాంత్ ఆచూకీ తెలియరాలేదని సమాచారం. 

 

77

పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్లో తన ఆట తీరు, మాట తీరుతో ప్రేక్షకుల హృదయాలు గెలిచాడు. ఒక సామాన్యుడు టైటిల్ గెలవాలని జనాలు ఓట్లు వేశాడు. టైటిల్ గెలిచిన వెంటనే అతడి ప్రవర్తన మారిపోయిందని సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది. ఇక పల్లవి ప్రశాంత్ ఎపిసోడ్ ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి... 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: 6 క్లాస్‌ ఫెయిల్‌ అయిన దేబ్జానీ, లైఫ్‌లో అతిపెద్ద సీక్రెట్‌ రివీల్‌.. నాగార్జున రియాక్షన్‌ ఇదే
Recommended image2
Bigg Boss Telugu 10: బిగ్‌ బాస్‌ హౌజ్‌లో మరో క్రేజీ లవ్‌ ట్రాక్‌.. వర్కౌట్‌ అయితే టీఆర్‌పీ బ్లాస్టే
Recommended image3
Chaitra Rai Remuneration: ఐదు రోజులకు చైత్ర రాయ్‌ ఎంత పారితోషికం అందుకుందో తెలుసా?.. ఆ భ్రమలకు ఫుల్‌ స్టాప్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved