Asianet News TeluguAsianet News Telugu

Bigg Boss Telugu 7: హౌజ్‌ తొలి కెప్టెన్‌ పల్లవి ప్రశాంత్‌.. హౌజ్‌ నుంచి వెళ్లిపోతా అంటూ అమర్‌దీప్‌ గగ్గోలు

కెప్టెన్సీ టాస్క్ ప్రారంభమైంది. వైట్‌ టీషర్ట్ పై ఎక్కువ కలర్‌ ఉంటే వాళ్లు ఔట్‌, తక్కువ కలర్‌ ఉంటే వాళ్లు విన్నర్‌ అని. ఈ గేమ్‌లో తేజ, సందీప్‌, ప్రశాంత్‌, గౌతమ్‌ పాల్గొన్నారు.

pallavi prashanth first captain in bigg boss telugu 7 house and amardeep wants to leave house arj
Author
First Published Oct 6, 2023, 11:22 PM IST | Last Updated Oct 6, 2023, 11:22 PM IST

బిగ్‌ బాస్‌ ఏడో సీజన్‌ ఐదో వారం శుక్రవారం గేమ్‌ ఆద్యంతం రసవత్తరంగా సాగింది. ఓ వైపు లెటర్స్ త్యాగం, మరోవైపు కెప్టెన్సీ టాస్క్ కోసం పోరాటం ఆద్యంతం ఆకట్టుకుంది. కెప్టెన్సీ టాస్క్ పీక్లోకి వెళ్లింది. కొట్టుకునేంత వరకు వెళ్లింది. మొదట.. హౌజ్‌లో హౌజ్‌మెట్స్ కి వారి ఫ్యామిలీ నుంచి లెటర్స్ వచ్చాయి. జంటలుగా ఉన్న హౌజ్‌మేట్స్ ఇద్దరిలో ఒకరు మాత్రమే లెటర్స్ చదవాలి, మరొకరు త్యాగం చేయాలి. అందులో సందీప్‌ కోసం అమర్‌ దీప్‌ లెటర్‌ త్యాగం చేశాడు. అందుకు అమర్‌ దీప్‌ కన్నీరు మున్నీరయ్యారు. సందీప్‌ కూడా కంటతడి పెట్టారు. వీరిద్దరి సన్నివేశాలు ఆద్యంతం గుండెని బరువెక్కించేలా సాగాయి. 

మరోవైపు శివాజీ, పల్లవి ప్రశాంత్‌ ల వంతు వచ్చినప్పుడు తన భార్య పంపిన కాఫీ తాగుతూ రిలాక్స్ అయ్యాడు శివాజీ. ప్రశాంత్‌ కోసం తన లెటర్‌ని త్యాగం చేశాడు. అంతేకాదు ప్రశాంత్‌కి ఇన్‌స్పైరింగ్‌ వర్డ్స్‌ చెప్పాడు. నువ్వు హౌజ్‌ లో ఉండాలని, ఒక రైతుబిడ్డ ఈ స్థాయికి వచ్చాడంటే అంతా గొప్పగా మాట్లాడుకోవాలని, కెప్టెన్‌ కావాలని అదే తాను కోరుకుంటానని, తనకోసం ఏమైనా చేస్తానని శివాజీ చెప్పాడు. శివాజీ త్యాగానికి కన్నీళ్లు పెట్టుకున్న ప్రశాంత్, తన ఫ్యామిలీ నుంచి వచ్చిన లెటర్‌ చదువుకుని ఆనందభాష్పాలతో మునిగిపోయాడు. అయితే తాను త్యాగం చేయడం కారణంగా అమర్‌ దీప్‌ చాలా బాధపడటం అందరిని కదిలించింది. 

ఇక కెప్టెన్సీ టాస్క్ ప్రారంభమైంది. వైట్‌ టీషర్ట్ పై ఎక్కువ కలర్‌ ఉంటే వాళ్లు ఔట్‌, తక్కువ కలర్‌ ఉంటే వాళ్లు విన్నర్‌ అని. ఈ గేమ్‌లో తేజ, సందీప్‌, ప్రశాంత్‌, గౌతమ్‌ పాల్గొన్నారు. మొదటి రౌండ్‌లో తేజ, రెండో రౌండ్‌లో సందీప్‌ ఔట్‌ అయ్యారు. మూడో రౌండ్‌లో ప్రశాంత్‌, గౌతమ్‌ ఉన్నారు. వీరిద్దరి మధ్య హోరా హోరీగా గేమ్‌ జరిగింది. కొట్టుకునే స్థాయికి వెళ్లింది. చివరికి అత్యంత ఉత్కంఠభరితమైన పోరులో కొద్దిపాటి కలర్‌ తక్కువతో ప్రశాంత్‌ విన్నర్‌ అయ్యారు. ఏదో సీజన్‌లో మొదటి కెప్టెన్‌గా పల్లవి ప్రశాంత్‌ నిలిచా సంచలనంగా మారాడు. 

అయితే ఈ గేమ్‌ మధ్యలో సందీప్‌ హడావుడి చేశాడు. ప్రశాంత్‌ తన టీషర్ట్ లాగాడని గొడవ చేశారు. సంచలకుడిగా ఉన్న ప్రియాంకని నిలదీశాడు. అలాగే తేజ సైతం అదే చేశాడు. ఏం చేయలేకపోయారు. మరోవైపు ప్రశాంత్‌ వైపు శివాజీ సపోర్ట్ చేస్తున్నాడని చెప్పి అమర్‌ దీప్‌ ఫైర్‌ అవుతూనే ఉన్నాడు, నేనే వెళ్లిపోతా, ఆడియెన్స్ చెప్పేది రైటే అయితే నేను హౌజ్‌ నుంచి వెళ్లిపోతా అంటూ బెదిరిస్తూ, గగ్గోలు పెట్టుకుంటున్నాడు. తన బాధని వ్యక్తం చేస్తూనే అరుస్తూ ఉన్నాడు. ఆయనది కాస్త ఓవర్‌గానూ అనిపించింది. ఫైనల్‌గా రైతు బిడ్డ తొలి కెప్టెన్‌ కావడం విశేషమనే చెప్పాలి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios