Asianet News TeluguAsianet News Telugu

Bigg Boss Telugu 7 : టేస్టీ తేజపై పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి? ఏమైంది

బిగ్ బాస్ తెలుగు కంటెస్టెంట్ టేస్టీ తేజా తాజాగా ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఆయనపై పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి చేశారు. 
 

Pallavi Prashanth fans fight with Bigg Boss Tasty Teja, why? NSK
Author
First Published Nov 7, 2023, 4:08 PM IST | Last Updated Nov 7, 2023, 4:12 PM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 నుంచి తాజాగా టేస్టీ తేజా (Tasty Teja) ఎలిమినేట్ అయ్యారు. బిగ్ బాస్ హౌజ్ నుంచి ఆయన బయటికి వచ్చిన సందర్భంగా ఫ్యాన్స్  గ్రాండ్ గా వెల్కమ్ పలికారు. అదేవిధంగా ర్యాలీగా కలిసి హౌజ్ నుంచి బయల్దేరారు. అభామానులు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఊహించని విధంగా పల్లవి ప్రశాంత్ అభిమానులు అతనిపై దాడి చేసినట్టు తెలుస్తోంది. ఇంతకీ  వాళ్లు ఎందుకు ఫైట్ కు దిగారనేది  ఆసక్తికరంగా మారింది.

అయితే, టేస్టీ తేజాకు భారీ స్వాగతం పలికిన సమయంలో... అన్నవదిన ఎట్లా ఉందంటూ.. ఫ్యాన్స్ అడిగారు. దీంతో శోభాశెట్టి గురించి మాట్లాడారు. కానీ దాన్ని తేజ ఫన్నీగా తీసుకున్నారు. ఇంతలోనే కొందరు తేజాపై దాడికి పడినట్టు తెలుస్తోంది. ఒక్కసారిగా టేస్టీ తేజాపై విరుచుకుపడ్డ వీడియోలు కూడా నెట్టింట వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగారు. అందరినీ చెదరగొట్టారు. 

మరోవైపు తేజా అభిమానులు కూడా సెల్ఫీల కోసం ఎగబడ్డారు. దీంతో కారు ఎక్కి తేజా అక్కడ నుంచి వెళ్లిపోయారు. బయటికి వచ్చిన రోజే తేజాకు ఇలాంటి అనుభవం ఎదురవడం అభిమానులను షాక్ కు గురిచేసింది. బిగ్ హాజ్ లో తేజా 9 వారాలు అలరించారు. ఇందుకు గాను భారీ రెమ్యూనరేషన్ ను అందుకున్నారు. తనదైన శైలిలో టీవీ ఆడియెన్స్ ను అలరించారు. 

 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios