ఇస్రో విజయవంతంగా చంద్రయాన్ 3 మిషన్ పూర్తి చేసింది. భారత్ సంబరాలు జరుపుకుంటుండగా పాకిస్తాన్ నటి సెహర్ షిన్వారీ సంచలన కామెంట్స్ చేశారు.  

అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ కీలక అధ్యాయం లిఖించింది. చంద్రయాన్ 3 మిషన్ విజయవంతంగా పూర్తి చేసింది. ఇస్రో పంపిన విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై ఆగస్టు 23న సేఫ్ గా ల్యాండ్ అయ్యింది. చంద్రునిపై ప్రయోగాల్లో భారత్ ముందడుగు వేసింది. ఈ విజయాన్ని ప్రతి ఒక్క భారతీయుడు సెలబ్రేట్ చేసుకుంటుంన్నాడు. అమెరికా, రష్యా వంటి అగ్ర రాజ్యాలు ఇస్రో సాధించిన విజయాన్ని కొనియాడుతున్నాయి. 

చంద్రయాన్ 3 సక్సెస్ దాయాది దేశం పాకిస్తాన్ ని సమస్యల్లోకి నెట్టింది. ఆ దేశపౌరులే తమ పాకిస్తాన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. భారతీయులైతే పాకిస్తాన్ ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో పాకిస్తానీ నటి సెహర్ షిన్వారీ సంచలన ట్వీట్ చేశారు. ఆమె భారత్ ని పొగుడుతూ పాకిస్తాన్ పై విమర్శలు చేసింది. 

Scroll to load tweet…

'భారత్ తో శత్రుత్వం పక్కన పెడితే... చంద్రయాన్ 3 విజయం ద్వారా ఇస్రో అంతరిక్ష ప్రయోగాల్లో చరిత్ర లిఖించింది. అన్ని కోణాల్లో భారత్-పాకిస్థాన్ మధ్య అంతరం పెరిగిపోయింది. భారత్ ను పాకిస్తాన్ అందుకోవాలంటే రెండు మూడు దశాబ్దాల సమయం పడుతుంది. దీనికి ఎవరో బాధ్యులు కాదు, దురదృష్టవశాత్తు పాకిస్తానీ ప్రజలే' అని ఆమె ట్వీట్ చేశారు. 

సెహర్ షిన్వారీ ట్వీట్ వైరల్ అవుతుంది. చాలా మంది పాకిస్తానీయులు ఆమె అభిప్రాయాన్ని సమర్థిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఉగ్రవాదాన్ని స్వయంగా పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ఆర్థికంగా కుదేలై పేద దేశాల జాబితాలో చేరింది. పాకిస్తాన్ కంటే తక్కువ వనరులు ఉన్న భారత్ ప్రజాస్వామ్య దేశంగా అంచెలంచెలుగా ఎదుగుతుంది. 

సెహర్ షిన్వారీ హైదరాబాద్(పాకిస్తాన్)లో జన్మించింది. ఆమె షిన్వారీ తెగకు చెందిన అమ్మాయి. ఆమె నటిగా మారడాన్ని సమాజంతో పాటు షిన్వారీ తెగ వ్యతిరేకించింది. ఆమె పోరాటం చేసి నటి అయ్యారు. కామెడీ సీరియల్ 'సైర్ సవా సైర్' లో సెహర్ షిన్వారీ నటించింది.