పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ లోపాకిస్తాన్ ఆర్మీకి భారత్ పైలట్ అభినందన్ చిక్కిన సంగతి తెలిసిందే. ఈరోజు ఆయన స్వదేశానికి చేరుకోనున్నారు. 

పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ లో పాకిస్తాన్ ఆర్మీకి భారత్ పైలట్ అభినందన్ చిక్కిన సంగతి తెలిసిందే. ఈరోజు ఆయన స్వదేశానికి చేరుకోనున్నారు. అభినందన్ విడుదల కోసం భారతీయులు ఎంతగానో ప్రార్ధించారు. అయితే అభినందన్ ని విడుదల చేయాలని భారతీయులతో సహా పాకిస్తానీయులు కూడా కోరుకున్నారని పాక్ నటుడు, దర్శకుడు జమాల్ షా అన్నారు.

'మా ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్థానంలో నేనున్నా అదే చేసేవాడిని.. ఎందుకంటే పాకిస్తాన్ లో మెజారిటీ ప్రజలు భారత పైలట్ ని విడుదల చేయాలని మనస్పూర్తిగా కోరుకున్నారు' అంటూ వెల్లడించారు. ప్రజల సెంటిమెంట్ ని గౌరవించి ఇమ్రాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం పరిస్థితుల్లో యుద్ధం వస్తే పాక్ ప్రజల పరిస్థితి మరింత దిగజారేదని తన అభిప్రాయం వెల్లడించారు.

ఇప్పటికే తమ దేశంలో డెబ్బై శాతం మంది ప్రజలు దారిద్ర్య రేఖకి దిగువ స్థానంలో బతుకుతున్నారని.. యుద్ధం వస్తే ఆ ఎఫెక్ట్ మరింత పడేదని అన్నారు. ఇక పాకిస్తాన్ లో భారత సినిమాలను బ్యాన్ చేయడం, భారత్ లో పాకిస్తాన్ నటులను బ్యాన్ చేయడం పట్ల స్పందిస్తూ.. కళలు, సంస్కృతి ప్రజల మధ్య సత్సంబంధాలు నెలకొనడానికి తోడ్పడతాయని అన్నారు.

భారత్-పాకిస్తాన్ సంగీతం, సినిమా ఇలా ఎన్నో మాధ్యమాల కారణంగా మానసికంగా ముడిపడిపోయినట్లు.. శాంతి చర్చలకు అవకాశం దొరికితే పొరుగుదేశం నటులతో మా అనుబంధం మరింత దృఢపడుతుందనే నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.