శర్వానంద్, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం 'పడి పడి లేచే మనసు'. హనురాఘవపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్ షోలు పలు చోట్ల ప్రదర్శితం కావడంతో ట్విట్టర్ లో ఈ సినిమాపై తమ స్పందనను తెలియజేస్తున్నారు నెటిజన్లు. 

తెరపై శర్వా, సాయి పల్లవిల జంట చక్కగా ఉందని, ఫ్రెష్ నెస్ ని తీసుకొచ్చిందని అంటున్నారు. లవ్, రోమాన్స్, సెంటిమెంట్, కామెడీ మేళవింపుతో కూడిన ఈ సినిమా ఎంతో ఆసక్తిగాకరంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు.

విడుదలకు ముందే ఈ సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. అల్లు అర్జున్ స్వయంగా ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ ఆడియో విడుదల కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రీరిలీజ్ బిజినెస్ దాదాపు రూ.22 కోట్లు వరకు చేసిన ఈ సినిమాకి ఇప్పుడు ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.

ఎప్పటిలానే సాయి పల్లవి తన నటనతో ఆకట్టుకుందట. సినిమా కథ, కథనాలు బాగున్నాయని, హను రాఘవాపూడి టేకింగ్ కి తోడు విశాల్ చంద్రశేఖర్ సంగీతం యూత్ ని కట్టిపడేస్తుంది. టైటిల్ సాంగ్ తో పాటు సినిమాలో మరో రెండు పాటలు ఆకట్టుకుంటున్నాయి.

Scroll to load tweet…

Scroll to load tweet…

Scroll to load tweet…

Scroll to load tweet…

Scroll to load tweet…