ఫిదా సినిమాతో కుర్రకారును ఒక్కసారిగా తనవైపుకు తిప్పుకున్న బ్యూటీ సాయి పల్లవి. నవ్వుతోనే ఆకర్షించే అమ్మడు మొదటిసారి శర్వా ను తన వెంట పడేలా చేసుకుంటోంది. వీరిద్దరూ పడి పడి లేచే మనసు అనే సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఎస్ ఎల్ వీ సినిమాస్ వారు నిర్మిస్తున్నారు. 

ఇకపోతే సినిమా మొదటి పోస్టర్ రిలీజ్ అయినప్పటి నుండే ఈ జోడి ఓ వర్గం వారిని బాగా ఆకట్టుకుంది. శర్వానంద్ కూడా కేవలం తనకు సెట్టయ్యే కథలను మాత్రమే ఎంచుకొని తనకంటూ ఒక ఫ్యాన్ ఫాలోవర్స్ ను పెంచుకుంటున్నాడు. అసలు మ్యాటర్ లోకి వస్తే అక్టోబర్ 10వ తేదీన ఉదయం 9:30కు పడి పడి లేచే మనసు టీజర్ ను రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. 

"ఈ చలికాలంలో రండి ప్రేమలో పడండి. అక్టోబర్ 10 న టీజర్ విడుదల" అంటూ నెటిజన్స్ ను ఆకట్టుకునే విధంగా పోస్టర్ రిలీజ్ చేశారు. హోలీ సంబరాల్లో శర్వా - సాయి పల్లవి పరిగెత్తుతూ ఉండడం స్పెషల్ ఎట్రాక్షన్ గా అనిపిస్తోంది. మరి సినిమాలో ఈ జోడి ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.